Share News

సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:49 PM

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.

సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్
KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న సీఎం తెలంగాణకు ఉండటం దురదృష్టమని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, చీర లాగారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా గజ్వేల్‌కి కాంగ్రెస్ గూండాలను, పోలీసులను పంపించారని ఆగ్రహించారు. రేవంత్‌రెడ్డి మనసులో మాటను ఇద్దరు శాసన సభ సభ్యులు మాట్లాడారని చెప్పుకొచ్చారు.


కేసీఆర్ ఎందుకు చావాలి..?..

‘కేసీఆర్ ఎందుకు చావాలి..? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా..?. సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. చావు ఎవరికైనా వస్తుంది.. అందరి కంటే ముందు కాంగ్రెస్‌కే ఆ చావు వస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పిన మాట తప్పారు.. హామీల అమలు గురించి అందరూ అడుగుతున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేస్తారు అట.. నీ జాగీరు కాదు. అసలు టార్గెట్ కేసీఆర్ కాదు.. మీకు హామీల అమలు మీద టార్గెట్ ఉండాలి. మా నాయకుడు దగ్గరకెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము పోలీసు స్టేషన్‌లో ఉంటే కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. తెలంగాణ ప్రజల తరుపున హామీలపై అసెంబ్లీలో అడగమని మా అధినేత చెప్పారని.. కానీ ఈరోజు సమాధానం చెప్పలేక మా ప్రజా ప్రతినిధులపై దాడి చేస్తున్నారు. ప్రజలను రేవంత్‌రెడ్డి లూఠీ చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడా.? అని రాహుల్ గాంధీని నిరుద్యోగులు అడుగుతున్నారు. మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఎక్కడా..?. ఆడపిల్లలకు ఇస్తానన్న స్కూటీలు ఏవి..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో గళమెత్తుతాం: మహేశ్వర్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 05:27 PM