కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:57 AM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారని సెటైర్లు గుప్పించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారని సెటైర్లు గుప్పించారు. కూలిపోయిన కాళేశ్వరం దగ్గరకు సిగ్గు లేకుండా ఎలా పోతారు.? అని ప్రశ్నించారు. ఈరోజు (సోమవారం) అసెంబ్లీ మీడియా హాల్లో మంత్రి ఉత్తమ్ చిట్‌చాట్ చేశారు. నీళ్ల సమస్యకు రెండే కారణాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్, ఎల్‌నినో రెండు కారణాలతోనే నీళ్ల సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.
కేసీఆర్ ఇంట్లో పడుకుంటే బెటర్..
నీళ్ల విషయంలో కేసీఆర్‌కి నాలెడ్జ్ లేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో పడుకుంటే బెటర్ అని హితవు పలికారు. అసభ్య వ్యాఖ్యల విషయంలో కేసీఆర్‌దే తప్పు అని చెప్పారు. కేసీఆర్ అనుచితంగా మాట్లాడినప్పుడు హీరోలాగా ఫీల్ అయ్యారని వ్యగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన భాషను ఆయనపై ఉపయోగిస్తే నానా యాగీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ తప్పులు చేశారని విమర్శించారు. ఇరిగేషన్ శాఖను నాశనం చేసింది కేసీఆరే అని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారని అన్నారు. ఈ ప్రాజెక్టు సరిగా కడితే ఈ సమస్య ఉండకపోయేది కదా అని నిలదీశారు. బీజేపీకి సరెండర్ అయితే తామేం చేస్తామని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడానికి అడ్డుకుంది ఎవరు? అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News