ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Sep 06 , 2026 | 07:05 PM
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈహెచ్‌ఎస్‌పై ఈరోజు (ఆదివారం) రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల ఆరోగ్య భద్రతే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఈహెచ్‌ఎస్ విధివిధానాలను రూపకల్పన చేస్తున్నాం..
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు మానవీయ కోణంలో పరిష్కరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆర్థిక, మానసిక ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈహెచ్‌ఎస్ విధివిధానాలను రూపకల్పన చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 354 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరిన్ని ఆస్పత్రులను డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో చేర్చామని చెప్పుకొచ్చారు.
హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలి..
హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈహెచ్‌ఎస్‌ను ఎవరూ అషామాషీగా తీసుకోవద్దని హుకుం జారీ చేశారు. ఈ పథకం సమర్థవంతమైన అమలుకు ఆయా ఆస్పత్రులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగ సంఘాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై తమ ప్రభుత్వం కమిటెడ్‌గా ఉందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి
చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News