శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెండ్
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:25 PM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. శాసనమండలి నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనమండలి ఆమోదించింది. తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలను బలవంతంగా మార్షల్స్ లాక్కెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మంత్రి దామోదర
అంతకుముందు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను సభలో పలువురు సభ్యులు ఖండించారు. ఈ క్రమంలో తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌కు పంపించారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బలపరిచారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఆధారాలతో కౌన్సిల్‌కు పంపాలని తీర్మానించారు.
మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. తమకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదని తెలిపారు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర, ఆత్మగౌరవ చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవమే తమ అలంకారమని.. ఆత్మగౌరవమే తమ స్ఫూర్తి అని చెప్పారు. ఆ ఆత్మగౌరవంతోనే ఇక్కడి వరకూ తాము వచ్చామని వెల్లడించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ యువతను, ముఖ్యంగా దళిత సమాజాన్ని, యువతను తక్కువగా అంచనా వేయొద్దని మంత్రి దామోదర్ రాజనర్సింహ హితవు పలికారు.
అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
అయితే, అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి వచ్చారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో వారు సమావేశమయ్యారు. తాతా మధు, నవీన్ రెడ్డిల రిమాండ్‌ను నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రవేశ పెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు.
కౌన్సిల్‌లో ఈ రోజే మాకు లాస్ట్: తాతా మధు
ఈ నేపథ్యంలో శాసన మండలి మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సస్పెన్షన్ వేటు పడినందున తాతా మధు ఇక్కడ మాట్లాడకూడదని అసెంబ్లీ మార్షల్స్ తెలిపారు. తాతా మధు మాట్లాడుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. ఆయనను మీడియా పాయింట్ నుంచి మార్షల్స్ తరలించారు.
కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో తాతా మధు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కౌన్సిల్‌లో ఈ రోజే మాకు లాస్ట్’ అని వ్యాఖ్యానించారు. ఒకసారి సభలో అడుగు పెట్టి వస్తా అంటూ కౌన్సిల్‌కు తాతా మధు, నవీన్ రెడ్డి వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో గళమెత్తుతాం: మహేశ్వర్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News