హైదరాబాద్-మంగళూరు మార్గంలో 18 సంక్రాంతి స్పెషల్స్
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:01 AM
సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-మంగళూరు మార్గంలో 18 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-మంగళూరు మార్గంలో 18 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబరు 2నుంచి 27వరకు ప్రతి బుధవారం 07097 ప్రత్యేక రైలు, డిసెంబరు 3నుంచి 28వరకు ప్రతి గురువారం 07098 ప్రత్యేక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. మార్గమధ్యంలో ఈ రైళ్లకు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, క్రిష్ణ, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక తదితర స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రశాంతి నిలయంలో 30 రైళ్లకు తాత్కాలిక హాల్ట్
ఈ నెల 23నుంచి పుట్టపర్తిలో జరగనున్న సత్యసాయిబాబా 101వ జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ఆ మార్గం లో నడిచే 30కి పైగా దూరప్రాంత ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రశాంతి నిలయం స్టేషన్లో తాత్కాలిక హాల్ట్ కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 17నుంచి 23వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా
నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News