ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా: దాసు సురేశ్
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:14 AM
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ప్రతి ఇంటికి ధీమా ఇచ్చే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని స్వాగతిస్తున్నామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కేవలం బీమా పథకమే కాదని పేద కుటుంబాల ఆత్మగౌరవానికి, జీవన భద్రతకు, భవిష్యత్తుపై నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయడంపై ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News