‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:35 AM
ఓరుగల్లు బీఆర్‌ఎస్‌లో చేరికల జోష్ కంటే, ఆధిపత్య పోరే హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్ సభను విజయవంతం చేయాలనే ప్రయత్నాల మధ్యే నాయకుల విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి.
మేయర్ సీటుపై హామీతో ఓ విద్యాసంస్థల అధినేత చేరిక వ్యూహం
మాజీ కార్పొరేటర్లను పార్టీలో చేర్పించేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే తహతహ
తన నియోజకవర్గంలో ఆ మాజీ పెత్తనం ఏమిటని నన్నపునేని వర్గం రుసరుస
పార్టీలో చేరికలపై ఓ వర్గంలో అసంతృప్తి.. ప్రోత్సహిస్తున్న మరోవర్గం
కేటీఆర్ సభ ఏర్పాట్లపై నేతల మధ్య గ్యాప్.. పోటాపోటీగా సమావేశాలు
గ్రేటర్‌యేతర నేతల పెత్తనం ఏమిటని బీఆర్‌ఎస్‌లో మరో వర్గం గుర్రు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
ఓరుగల్లు బీఆర్‌ఎస్‌లో చేరికల జోష్ కంటే, ఆధిపత్య పోరే హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్ సభను విజయవంతం చేయాలనే ప్రయత్నాల మధ్యే నాయకుల విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ మేయర్ సీటు హామీతో కొందరిని, పార్టీ బలోపేతం పేరుతో మరికొంతమంది మాజీ కార్పొరేటర్ల చేరికల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ చేరికల్లో పక్క నియోజకవర్గ నేతల జోక్యంపై అసంతృప్తి, కేటీఆర్ సభ ఏర్పాట్లపై పోటాపోటీ సమావేశాలు గులాబీ శిబిరంలో సమన్వయం కంటే ఆధిపత్య పోరే ఎక్కువ నడుస్తోందనే అభిప్రాయాలు క్యాడర్‌లో వినిపిస్తున్నాయి.
చేరికలపై ‘చల్లా’రని విభేదాలు
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మేయర్ సీటు జనరల్ స్థానం కావటంతో బలమైన నేతలను బరిలో దించాలనే ప్రయత్నంలో ఉంది. దీంతో ఏకశిల విద్యాసంస్థల అధినేత తిరుపతిరెడ్డిని పార్టీలోకి తీసుకవచ్చేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తిరుపతిరెడ్డి పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డిని ఈ నెల 22న హనుమకొండలో సభ నిర్వహించి పార్టీలోకి ఆహ్వానించాలని నేతలు నిర్ణయించారు.
అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ మేయర్ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించే విషయంలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని సమాచారం. మరోవైపు తిరుపతిరెడ్డి వ్యూహాత్మకంగానే పార్టీలో చేరుతు న్నారనే చర్చ జరుగుతోంది. మేయర్ సీటే కాకుండా భవిష్యత్తు రాజకీయా లను దృష్టిలో పెట్టుకుని గులాబీ గూటికి చేరుతున్నారని, ఓ మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అర్బన్ పాలిటిక్స్‌లో అడుగు పెడుతున్నారని మరోవర్గం గులాబీ నేతలు అగ్రహంతో ఉన్నారు.
ఇక వరంగల్‌తూర్పు నియోజకవ ర్గానికి చెందిన 10మంది మాజీ కా ర్పోరేటర్లు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని తె లుస్తోంది. కేటీఆర్ సమక్షంలో కార్పొ రేటర్లను పార్టీలో చేర్చేందుకు పొరు గు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒకరు తీవ్రంగా ప్రయత్నాలు చేశా రు. భువనగిరి వరకు వెళ్లిన మాజీ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోకుండా తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్ చెక్ పెట్టారని సమా చారం. కేటీఆర్‌కు ఫోన్ చేసి, ఆ మాజీలను పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోం ది. పొరుగు మాజీ ఎమ్మెల్యేకు తమ నియోజక వర్గంలో చేరికలపై ఎందుకంత ఆసక్తి అనే అసంతృప్తిలో నన్నపునేని వర్గం ఉంది. అయితే 22న హనుమకొండ సభలో ఎట్టిపరిస్థితుల్లో ఆ మాజీ కార్పొరేటర్లను గులాబీ కారు ఎక్కించా లని పొరుగు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. దీంతో గులాబీల్లో కేటీఆర్ సభ నాటికైనా ఈ అసంతృప్తి రాజకీయ వేడి ‘చలా’్లరేనా.. అనే చర్చ ఉంది.
సభ నిర్వహణఫై విభేదాలు
గ్రేటర్ వరంగల్‌లో గులాబీ పార్టీని బలోపేతం చేసేందుకు చేరికల జోష్ నింపాలని అధి ష్ఠానం భావిస్తోంది. దీనికోసం కీలకమైన నేత లను పార్టీలోకి ఆకర్షించడంతో పాటు జీడబ్ల్యూ ఎంసీ ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేసేందు కు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఈ నెల 22వ తేదీన హనుమకొండలో బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనేలా బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే సభ ఏర్పాట్లు, క్యాడర్, నేతల సమన్వ యంపై గులాబీ నేతల్లో వర్గవిభేదాలు బహిర్గ తం అవుతున్నాయి. కేటీఆర్ సభపై ఈ నెల 12న హనుమకొండలోని రాంనగర్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో నిర్వ హించిన సమావేశానికి వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన వర్గం నేతలు దూరంగా ఉన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, నరేందర్‌లు పాల్గొన్నారు. అయితే హను మకొండలో జరిగే సభకు ఆ నియోజకవర్గ పరిధి ఇన్‌చార్జి వినయ్‌భాస్కర్, గ్రేటర్ పరిధిలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు దూరంగా ఉండటం గులాబీశ్రేణుల్లో చర్చనీ యాంశంగా మారింది. వినయ్‌భాస్కర్ అధ్యక్షతన మరోసారి 16వ తేదీన పార్టీ కార్యాలయంలోకేటీఆర్ సభపై సమావేశం నిర్వహించారు. ఆరూరితో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో జరిగే సభకు గ్రేటరేతర నేతల జోక్యం ఏమిటని అర్బన్ గులాబీలు గుర్రుగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ సభ నిర్వహణపై సమన్వయం చేసేందుకు అధిష్ఠానం ఎవరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించ కపోవడంతో సభ నాటికి విభేదాలు మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి.
నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరే..
బీఆర్‌ఎస్‌లో గ్రేటర్ పరిణామాలే కాకుండా ఇటీవల పరకాల పోరు కారును కుదిపేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధిపత్యం పెరుగకుం డా మరో వర్గం అడ్డుపడుతోందనే చర్చ ఉంది. పోచంపల్లి పౌండేషన్ ఆధ్వర్యం లో పరకాలలో నిర్వహిం చిన క్రీడా పోటీలు గులాబీ పార్టీలో చిచ్చురేపాయి. తమ నేత చల్లా ధర్మారెడ్డి ఫొటో లేకుండా బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు ఏలా ఏర్పాటు చేస్తారని, ఈ నెల 8న రాత్రికి రాత్రే చల్లా వర్గీయులు పోచంపల్లి ఫ్లెక్సీలను చింపివేయడం పార్టీలో దుమారం రేగింది. దీంతో ఇది నా సొంత గడ్డ.. నా జన్మభూమికి సేవలు చేసేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదంటూ పోచంపల్లి చేసిన కామెంట్ పరకాల గులాబీలో కాక రేపాయి.
వీటితో పాటు భూపాలపల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటు న్నాయి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో క్యాడర్‌లో అయోమయం నెలకొంటోంది. నర్సంపేట బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి విషయంలో క్యాడర్ లో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ పోచం పల్లికి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను పార్టీ అప్పగించింది. వరంగల్ పశ్చిమలో మాజీ ఎమ్మెల్యే వినయ్‌బాస్కర్‌కు చెక్ పెట్టేందుకు మరోవర్గం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి గత ఉప ఎన్నికలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్‌రెడ్డిని దూరం పెట్టడంతో చర్చనీయాంశంగా మారింది. జనగామలో పట్టుకోసం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్‌పై పట్టుకోసం మాజీ ఎంపీ కవిత కన్నేయగా, డోర్నకల్‌పై మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఖర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటంతో పాటు సేఫ్ సీటు కోసం ఇప్పటి నుంచే గులాబీ నేతల్లో ఆధిపత్యపోరు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 22న జరుగనున్న కేటీఆర్ సభ నేతల మధ్య విభేదాలకు ఫుల్‌స్టాప్ పెడుతుందా..? ఎన్నికల వరకు ఇదే తంతు సాగుతుందా? అనే ఉత్కంఠ గులాబీ క్యాడర్‌లో నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News