Share News

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:07 AM

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నూజివీడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు
Eluru Tiger Movement

ఏలూరు జిల్లా, నవంబర్ 18: జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నూజివీడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏలూరు జిల్లా లింగపాలెం, ధర్మాజీగూడెం, చింతలపూడి, చాట్రాయి, చిత్తపూర్, పోలవరం గట్టుల మీదుగా ముసునూరు మండలం రమణక్కపేట ఫారెస్ట్ రేంజ్‌లోకి పులి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు.


పులి సంచారం నేపథ్యంలో పొలం పనులకు వెళ్లే సమీప గ్రామాల ప్రజలు, రైతులకు రెవెన్యూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మారుమూల ఊర్లు, శివారు దట్టమైన అడవి మార్గాలలో నిరంతర పోలీస్ పహారాతో గస్తీ ముమ్మరం చేశారు. పులిని బంధించి పట్టుకునేందుకు మహారాష్ట్రకు చెందిన పుణె ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. పులి సంచారంతో రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని అధికారులు హెచ్చరించారు. పులి కదలికల సమాచారంతో స్థానిక గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. వీలైనంత త్వరగా పులిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అలర్ట్.. అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలివే

ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 11:14 AM