Share News

ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:15 AM

ఇన్సూరెన్స్ లేని వాహనాలపై కేంద్రం జరిమానాల విధింపు నిర్ణయంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. టోల్ ప్లాజాల వద్ద ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించే విధానంపై వాహనదారులకు మంత్రి కీలక సూచనలు చేశారు.

ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు
Minister Mandipalli Ramprasad reddy

అమరావతి, నవంబర్ 18: ఇన్సూరెన్స్ లేని వాహనాలపై కేంద్రం జరిమానాల విధింపు నిర్ణయంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. టోల్ ప్లాజాల వద్ద ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించే విధానంపై వాహనదారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. సురక్షిత ప్రయాణం, ప్రమాద బాధితుల ఆర్థిక భరోసా కల్పించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తీసుకొస్తున్న నూతన విధానానికి అనుగుణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువు ముగిసేలోపే రెన్యువల్ చేసుకోవాలని మంత్రి అన్నారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని తెలిపారు. రవాణా శాఖ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్రంలోని వాహనదారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆసియాన్‌కు నవశకం

అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అలర్ట్.. అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 10:18 AM