‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:09 AM
విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంపొందించేందుకు అమలు చేస్తున్న ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమానికి పర్యాటక శాఖ తరఫున రూ.11.69 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంపొందించేందుకు అమలు చేస్తున్న ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమానికి పర్యాటక శాఖ తరఫున రూ.11.69 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ జీవో నం.341ను జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 2.92 లక్షల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పర్యాటక అభివృద్థి సంస్థ (టీజీటీడీసీ) విద్యాశాఖ సమన్వయంతో విద్యా, సాంస్కృతిక విజ్ఞాన యాత్రలు నిర్వహించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900 చొప్పున రవాణాతోపాటు ఇతర పర్యాటక సేవలు అందించనున్నారు. తెలంగాణకు ఘనమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం, అపురూపమైన చారిత్రక కట్టడాలు, ఆలయాలు, సహజ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ దర్శిని ద్వారా విద్యార్థులు ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి వాటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి...
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..
ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
Read Latest National News And Telugu News