బంగారం, వెండి కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 10:24 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,780 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,550 మేర ధర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది.
గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం పది గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 తగ్గి రూ.1,33,260కు చేరింది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,22,150 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ధర రూ.1.85 లక్షలకు చేరింది. ఇటీవలి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
వరంగల్ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
నిజామాబాద్ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
ఖమ్మం | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
విశాఖపట్నం | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
అమరావతి | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
కాకినాడ | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
తిరుపతి | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,33,260 | ₹1,22,150 | ₹1,00,000 |
ముంబై | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
ఢిల్లీ | ₹1,33,410 | ₹1,22,300 | ₹1,00,100 |
కోల్‌కతా | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
కేరళం | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
పుణె | ₹1,33,260 | ₹1,22,150 | ₹99,940 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..