కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:28 AM
జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా బలగాల సంయుక్త బృందానికి మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బుధవారం ఉదయం ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా బలగాల సంయుక్త బృందానికి మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు 'ఎక్స్' ద్వారా వెల్లడించారు. కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల సంయుక్త బృందం మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి (Kulgam Encounter).
నవంబరు 11న కుల్గాంలోని అఖ్రాన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. ఈ దాడిలో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌తో పాటు ఉమర్ నిసార్ దార్ పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 10న వీరిద్దరూ మిర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో సంచరిస్తూ భద్రతా బలగాల కదలికలను పరిశీలించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా బయటపడింది (Jammu Kashmir News).
సోమవారం భద్రతా బలగాలు లారూ బైపాస్ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు (Kashmir Encounter). అతడితో పాటు ఉన్న లతీఫ్ భట్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరోసారి ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కుల్గాం ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!