Share News

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:04 PM

జంగిల్ సఫారీ అంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని భావిస్తాం. వన్యప్రాణులను దగ్గర నుంచి చూడొచ్చని అనుకుంటాం.

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

ఇంటర్నెట్ డెస్క్: జంగిల్ సఫారీ అంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని భావిస్తాం. వన్యప్రాణులను దగ్గర నుంచి చూడొచ్చని అనుకుంటాం. అందుకే చాలా మంది ఉత్సాహంగా జంగిల్ సఫారీలో పాల్గొంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ ఉత్సాహం మరణ భయంగా మారొచ్చు. నేపాల్‌లోని ఒక జాతీయ పార్క్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన కొందరు జంగిల్ సఫారీలో పాల్గొనాలంటేనే భయపడుతున్నారు.


మొదట ఆ వీడియోలో కొందరు ఏనుగుల మీద కూర్చొని పార్క్‌లో పర్యటిస్తున్నట్టు కనిపిస్తోంది. బాగా పెరిగిన గడ్డి మధ్య నుంచి ఆ ఏనుగులు వెళ్తుంటాయి. అప్పటివరకు అంతా ప్రశాంతంగానే ఉంది. అప్పుడే ఓ పెద్దపులి ఒక్కసారిగా ఏనుగుపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే పర్యాటకుల కేకలు విని పులి వెనక్కు తగ్గింది. దీంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జంగిల్ సఫారీలో పొంచి ఉన్న ప్రమాదం గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు. అదృష్టం కొద్ది పులి వెనక్కు తగ్గిందని అంటున్నారు.


ఇవీ చదవండి

బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

ఢిల్లీలో ఫ్యామిలీ హెరాయిన్ నెట్‌వర్క్.. రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఆరుగురి అరెస్ట్

Updated Date - Nov 15 , 2026 | 05:05 PM