Share News

బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:56 PM

బహ్రెయిన్‌లోని రిఫా హెలికాప్టర్ స్థావరంపై ఆదివారం ఇరాన్ సైన్యానికి చెందిన ఐఆర్‌జీసీ దళం దాడి చేసింది.

బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..
Iran drone attack on Bahrain

ఇంటర్నెట్ డెస్క్: బహ్రెయిన్‌లోని రిఫా హెలికాప్టర్ స్థావరంపై ఆదివారం ఇరాన్ సైన్యానికి చెందిన ఐఆర్‌జీసీ దళం దాడి చేసింది. హెలికాప్టర్‌ బేస్‌పై మొత్తం ఆరు డ్రోన్స్‌తో విజయవంతంగా దాడి చేశామని పేర్కొంది. అమెరికా మిలిటరీ దూకుడు చర్యలకు ప్రతిగా ఈ దాడి చేసినట్టు తెలిపింది. అయితే, ప్రత్యర్థి చేసిన దాడులను తాము విజయవంతంగా అడ్డుకున్నామని బహ్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. సెప్టెంబర్ తరువాత ఇరాన్ మళ్లీ డ్రోన్ దాడికి దిగడం ఇదే తొలిసారి. ఇరాన్‌పై తదుపరి దాడులు ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఇరాన్ డ్రోన్ దాడికి దిగడంతో హోర్ముజ్‌లో ఉద్రిక్తత చెలరేగింది.


ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ గాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని అన్నారు. తమ సహేతుక షరతులకు అమెరికా అంగీకరిస్తే యుద్ధం ముగుస్తుందని చెప్పారు. యుద్ధం లేదు.. శాంతి లేదు.. అనే స్థితిని ఎక్కువ కాలం కొనసాగించడం ఇష్టం లేదని అన్నారు. అయితే, అమెరికా మళ్లీ దాడులకు దిగితే మాత్రం ఈసారి యుద్ధ క్షేత్రాన్ని తాము నిర్ణయిస్తామని హెచ్చరించారు. యుద్ధం మొదలైన తొలి నాళ్లలో పలు గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. బహ్రెయిన్‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువెయిట్, జోర్డాన్, ఒమాన్, ఇరాన్‌లపై వేల కొద్దీ డ్రోన్‌లు, మిసైళ్లను ప్రయోగించింది.


ఈ వార్తలనూ చదవండి:

మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

Updated Date - Nov 15 , 2026 | 04:02 PM