ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. కోహీర్‌లో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
ABN , Publish Date - Nov 18 , 2026 | 10:45 AM
ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
కోహీర్(మెదక్): ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో గత ఆరు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో రానున్న తుఫాన్ ప్రభావంతో ఈ చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా కోహీర్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్గోల్‌లో 11.3, సత్వార్‌లో 11.4, నల్లవల్లిలో 11.9, న్యాల్కల్, మొగ్దంపల్లిలలో 12.4, మల్చెల్మలో 12.6, జిన్నారంలో 12.8 డిగ్రీలు రికార్డయ్యాయి. అలాగే లక్ష్మీసాగర్, పుల్కల్‌లో 13.0, పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం, హత్నూరలో 13.1, నిజాంపేటలో 13.2, చౌటకూర్, జహీరాబాద్‌లలో 13.3, బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ, గుండ్ల మాచనూర్, కంగ్టిలలో 13.4, ఆల్మాపేట్‌లో 13.5, కల్హేర్, కడ్పల్, పాశమైలారంలో 13.6, కిష్టారెడ్డిపేట, కందిలలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఝరాసంగం, దిగ్వాల్‌లలో 14.1, సుల్తాన్‌పూర్, ముక్తాపూర్, మునిపల్లిలలో 14.2, అన్నసాగర్, సిర్గాపూర్‌లలో 14.3, ఎంపీడీవో కార్యాలయం, రాయికోడ్‌లలో 14.6, సదాశివపేటలో 14.7, రుద్రారం గీతం వద్ద 14.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మెదక్ జిల్లాలో..
సర్ధనలో అత్యల్పంగా 12.1 డిగ్రీలు నమోదు కాగా.. కాగజ్ మద్దూర్‌లో 12.7, నాగాపూర్‌లో 12.8, చిట్కుల్, కౌడిపల్లిలలో 12.9, కుల్చారం, బుజరంపేటలలో 13.2, పాతూర్‌లో 13.4, చిప్పల్తుర్తి, కొత్తపేటలలో 13.5, శివంపేటలో 13.7, నర్సాపూర్‌లో 13.8 డిగ్రీలు రికార్డయ్యాయి. వాడి, ర్యాలమడుగులలో 14.1, ఇస్లాంపూర్, మిన్‌పూర్ ఈఎ్‌సఎ్‌సలలో 14.3, బోడగట్ ఈఎ్‌సఎస్ వద్ద 14.5, నర్లాపూర్‌లో 14.7, శంకరంపేట (ఏ)లో 14.8, శివనూరు ఈఎ్‌సఎస్ వద్ద 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో మునిగడపలో 12.6 డిగ్రీలు నమోదు కాగా.. నంగునూర్, బేగంపేట, కొండపాకలలో 12.8, అంగడి కిష్టాపూర్‌లో 12.9, గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద 13.0, హబ్షీపూర్‌లో 13.1, కొడకండ్లలో 13.2, వెంకట్రావుపేటలో 13.4, తిప్పారం, పోతరెడ్డిపేటలలో 13.5, గౌరారంలో 13.6, మిరుదొడ్డిలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లకుడారం, దుల్మిట్టలలో 14.0, రాంపూర్‌లో 14.1, బెజ్గాం, రెబర్తిలలో 14.3, చీకోడ్‌లో 14.4, గండిపల్లిలో 14.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News