Share News

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర.. హైకోర్టులో పోలీసుల కౌంటర్

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:33 AM

కొంతమంది మహిళల నుంచి అండాలను అక్రమంగా విక్రయించిన కేసులో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ పి. పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. 

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర.. హైకోర్టులో పోలీసుల  కౌంటర్
Illegal Egg Donation Case

హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొంతమంది మహిళల నుంచి అండాలను అక్రమంగా విక్రయించిన కేసులో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ పి. పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.  అండాల విక్రయ దందాలో డాక్టర్ పద్మజ పాత్ర కీలకమని కోర్టుకు నివేదిక  సమర్పించారు. ఆమెకు బెయిల్ ఇస్తే కీలక ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సరూర్‌నగర్, బేగంపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పద్మజ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఈ పిటిషన్‌‌పై జస్టిస్ నందికొండ నర్సింగరావు విచారణ చేపట్టారు. తదుపరి విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా  వేశారు. గత నెల సరూర్‌నగర్ వర్కింగ్ హాస్టల్ తనిఖీల్లో అండాల అక్రమ దందా వెలుగుచూసిన విషయం తెలిసిందే.  వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది మహిళలను అండాల దానం కోసం ముఠా సిద్ధం చేసింది. ఒక్కో అండానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తామని ఆశచూపి హైదరాబాద్‌కు మహిళలను తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


ఈ కేసులో ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. పద్మజ, నర్మద, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లినట్లు బాధిత మహిళలు వాంగ్మూలం ఇచ్చారు. నిందితులపై హైదరాబాద్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. పరారీలో మరికొందరు నిందితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 09:06 AM