Share News

వెండి మెరుపులకు

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:27 AM

ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న వెండి నగలు కొద్ది రోజులకే నల్లగా మారి మెరుపును కోల్పోవడం గమనిస్తుంటాం. అలాకాకుండా ఉండాలంటే...

వెండి మెరుపులకు

ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న వెండి నగలు కొద్ది రోజులకే నల్లగా మారి మెరుపును కోల్పోవడం గమనిస్తుంటాం. అలాకాకుండా ఉండాలంటే...

  • జిప్‌లాక్‌ ప్లాస్టిక్‌ బ్యాగుల్లో వెండి నగలను భద్రపరచాలి. ఆ బ్యాగుల్లో రెండు వైపులా వెల్వెట్‌ క్లాత్‌, దూది లేదా మెత్తటి కాటన్‌ వస్త్రాన్ని పెడితే నగల మెరుపు చాలా రోజుల వరకు నిలిచి ఉంటుంది.

  • వెండి ఆభరణాలు పెట్టిన చోట పొడిగా ఉండేలా చూడాలి. చుట్టూ చాక్‌పీస్‌లు లేదా సిలికా జెల్‌ ప్యాకెట్లను ఉంచితే అవి గాలిలోని తేమను పీల్చుకుంటాయి. దీంతో నగలు ఎప్పటికీ తెల్లగా మెరుస్తుంటాయి.

  • వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి లిక్విడ్‌ క్లీనర్స్‌ను ఉపయోగించకూడదు. ఇవి డిజైన్ల సందుల్లో చేరి నగల ఆకృతిని పాడు చేస్తాయి. ఇంట్లో దొరికే వెనిగర్‌, బేకింగ్‌ సోడా లాంటివి ఉపయోగించి కొత్తవాటిలా మెరిపించవచ్చు.

  • ధరించిన ప్రతిసారీ నగలను శుభ్రం చేయాల్సిన అవసరంలేదు. కాటన్‌ లేదా వెల్వెట్‌ క్లాత్‌తో నగలను సున్నితంగా తుడిస్తే చాలు... వాటిపై చేరిన దుమ్ము,చెమట తొలగిపోతాయి.

  • ఇంటి పనులు, స్విమ్మింగ్‌, వ్యాయామం చేసేటప్పుడు ఒంటి మీద ఉన్న వెండి నగలు తీసి పక్కన పెట్టాలి. బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నా వీటిని ధరించకపోవడమే మంచిది. అనుకోకుండా నగలు తడిసినప్పుడు వెంటనే వాటిని తేమ లేకుండా తుడిచి పొడిగా ఆరబెట్టాలి. అవసరమనిపిస్తే వాటికి మెరుగు పెట్టించవచ్చు.

  • మేకప్‌ పూర్తయి పర్ఫ్యూమ్‌ స్ర్పే చేసుకున్న తరువాతనే వెండి నగలు ధరించాలి. లేదంటే ఆ ఉత్పత్తుల్లోని రసాయనాల వల్ల నగల మెరుపు తగ్గవచ్చు.

ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 03:27 AM