Share News

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:50 AM

కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. రాజోలు సమీపంలోని గెద్దాడవారి కుంత వద్ద గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Minister Atchannaidu

అంబేద్కర్ కోనసీమ జిల్లా, నవంబర్ 17: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. రాజోలు సమీపంలోని గెద్దాడవారి కుంత వద్ద గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచనలు చేశారు. గ్యాస్ లీకేజీ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


పరిసర గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


గ్యాస్ లీకేజీపై హోంమంత్రి స్పందన

anitha

కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. గ్యాస్ లీకేజీని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 09:54 AM