కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:20 AM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్‌జీ గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి సీఎన్‌జీ గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్‌జీ గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. మూసివేసిన వెల్ నుంచి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో గ్యాస్ వెలువడింది. దీనితో పాటు భారీ శబ్దాలు వచ్చాయి. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ నిపుణులు చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండలో భారీ బ్లోవుట్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలోనే మామిడి కుదురులో భారీ బ్లో అవుట్ సంభవించింది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తరచూ గ్యాస్ లీక్‌లు జరుగుతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
బ్లో బ్లోటును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని వెంటనే అదుపు చేసి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. 2014లో నగరంలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీ విస్ఫోటనం సంభవించి 22 మంది మృతిచెందిన ఘటనను పరిసర గ్రామాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ఓఎన్జీసీ అధికారులతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీలు మాట్లాడుతున్నారు. గ్యాస్‌ను అదుపు చేసేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి ఓఎన్‌జీసీ అధికారులు తీసుకువస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News