Share News

అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోలో విషాదం.. బుల్డోజర్ ఢీకొని బీజేపీ నేత కుమారుడి మృతి

ABN , Publish Date - Nov 19 , 2026 | 10:24 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన రోడ్‌షోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ సందర్భంగా బుల్డోజర్ ఢీకొని స్థానిక బీజేపీ నేత ఓంకార్ సింగ్ కుమారుడు ఆర్యవర్ధన్ సింగ్ మృతిచెందాడు.

అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోలో విషాదం.. బుల్డోజర్ ఢీకొని బీజేపీ నేత కుమారుడి మృతి
Akhilesh Yadav

లఖ్‌నవూ, నవంబర్ 19: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన రోడ్‌షోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ సందర్భంగా బుల్డోజర్ ఢీకొని స్థానిక బీజేపీ నేత ఓంకార్ సింగ్ కుమారుడు ఆర్యవర్ధన్ సింగ్ (12) మృతిచెందాడు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.


నిన్న (బుధవారం) గోరఖ్‌పూర్‌లోని కూఢాఘాట్ ప్రాంతంలో అఖిలేశ్ యాదవ్ రోడ్‌షో నిర్వహించారు. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి చౌరీచౌరాలోని డియోకాహి వరకు ఈ రోడ్‌షో కొనసాగింది. ఈ సందర్భంగా ర్యాలీకి స్వాగతం పలికేందుకు ఓ బుల్డోజర్‌తో పూల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో చౌరీచౌరాలోని రాజధాని గ్రామానికి చెందిన ఆర్యవర్ధన్ సింగ్‌ను బుల్డోజర్ వెనుక నుంచి ఢీకొట్టింది. బాలుడిని బలంగా ఢీకొట్టడంతో అతడు ఎగిరి డివైడర్‌పై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆర్యవర్ధన్ సింగ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు, స్థానిక బీజేపీ నేతలు నిరసనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


విషయం తెలుసుకున్న గోరఖ్‌పూర్ ఎమ్మెల్యే ఇంజినీర్ సర్వన్ నిషాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, యూపీ కేబినెట్ మంత్రి డాక్టర్ సంజయ్ నిషాద్ కూడా ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ ఘటనపై అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. బాలుడు మృతిచెందిన విషయం తనకు తెలియదని చెప్పారు. రోడ్‌షోకు సంబంధించి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన బుల్డోజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై..

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తోసుకుంటూ యువకుడి పరుగు..

Updated Date - Nov 19 , 2026 | 10:43 AM