రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై..
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:05 AM
గుజరాత్‌లో ఓ మహిళా పోలీసు అధికారిణి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైంది. ఓ కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు రూ.20 వేలు డిమాండ్ చేసింది మహిళా ఎస్సై. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.
వడోదరా, నవంబర్ 19: గుజరాత్‌లో ఓ మహిళా పోలీసు అధికారిణి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైంది. ఓ కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు రూ.20 వేలు డిమాండ్ చేసింది మహిళా ఎస్సై. బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించడంతో ఆమెను పట్టుకునేందుకు పథకం ప్రకారం వల పన్నారు. రూ.20 వేలు తీసుకుంటుండగా ఆ మహిళా పోలీసు అధికారిణిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన వడోదరా జిల్లా దభోయ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.
వడోదరా జిల్లా దభోయ్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఏక్తా పాండ్యా (37) పనిచేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తిపై అక్రమ మద్యం కేసు నమోదైంది. దీంతో నిందితుడు గుజరాత్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతని మొబైల్ ఫోన్‌ను మహిళా ఎస్సై స్వాధీనం చేసుకుంది. దానిని తిరిగి ఇవ్వాలంటే రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. నగదు ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు.
నవంబర్ 17న బాధితుడి నుంచి ఎస్సై ఏక్తా పాండ్యా రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల బృందం పట్టుకుంది. లంచం సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మహిళా ఎస్సై ఇలా డబ్బులు డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
స్వదేశీ వ్యాక్సిన్‌తో బర్డ్‌ఫ్లూకి బ్రేక్..!
విటమిన్ బీ12తో రీచార్జబుల్ బ్యాటరీ తయారీ