స్వదేశీ వ్యాక్సిన్‌తో బర్డ్‌ఫ్లూకి బ్రేక్..!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:30 AM
కోళ్లలో ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ వైరస్‌కు అడ్డుకట్ట వేసే స్వదేశీ వ్యాక్సిన్ సిద్ధమైంది.
రేపే అందుబాటులోకి హెచ్5ఎన్1 టీకా
న్యూఢిల్లీ, నవంబరు 18: కోళ్లలో ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ వైరస్‌కు అడ్డుకట్ట వేసే స్వదేశీ వ్యాక్సిన్ సిద్ధమైంది. దేశంలోనే తొలి స్వదేశీ హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ టీకా శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. భోపాల్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్) శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దీన్ని భోపాల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. భారత్‌లోని కోళ్లలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న హెచ్5ఎన్1 హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌పీఏఐ) వైరస్‌లోని క్లేడ్ 2.3.2.1ఏ రకాన్ని అడ్డుకునేందుకు ఈ టీకాను రూపొందించారు. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు వేయడం వల్ల కోళ్లకు సుమారు ఆరునెలలపాటు బర్డ్‌ఫ్లూ నుంచి రక్షణ ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు