కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:11 PM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇండియా కూటమిలో చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇండియా కూటమిలో చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 181 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతుండగా.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మాత్రం కేవలం 24 స్థానాలే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా సాగేలా కనిపించడం లేదు (UP Elections 2027).
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 20 వేలకుపైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని ఎస్పీ ఈ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి స్థానాలు 21 ఉండగా.. మరో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 20 వేల ఓట్లకు చేరువగా వచ్చారు. దీంతో 24 స్థానాలతో చర్చలు ప్రారంభించాలని ఎస్పీ భావిస్తోందని తెలుస్తోంది. సీట్ల పంపకాల కోసం సమాజ్‌వాదీ పార్టీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. నవంబర్ 23, 24, 25 తేదీల్లో కాంగ్రెస్ నేతలతో ఈ బృందం ఢిల్లీలో చర్చలు జరిపే అవకాశముందని ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ తెలిపారు (SP Congress Alliance).
మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది (UP Seat Sharing). ఈ కమిటీ సీట్ల పంపకాలపై ఎస్పీతో చర్చించనుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో తమకు 181 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ ఇప్పటికే ఎస్పీకి జాబితా సమర్పించినట్లు వార్తలు వచ్చాయి. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయిస్తే మొదటికే మోసం వస్తుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..