Share News

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:41 PM

మతపరమైన వేడుకలు, ఆలయాల్లో జంతువధను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: మతపరమైన వేడుకలు, ఆలయాల్లో జంతువధను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయవాది శృతి బిష్త్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జంతు హింస నిరోధక చట్టం, 1960లో మతపరమైన మినహాయింపులను సవరించాలని తన పిటిషన్‌లో కోరారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మతం పేరుతో జంతుబలులు కొనసాగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మతం పేరిట జంతువులను చంపడం ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. జంతుబలులను నిషేధించేలా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ల ధర్మాసనం పిటిషనర్ వాదనలు విన్న అనంతరం వ్యాజ్యాన్ని కొట్టివేసింది.


ఈ వార్తలనూ చదవండి:

శిక్షపై స్టే కేవలం ఎన్నికల కోసం కాదు.. సుప్రీంలో ఆజం ఖాన్ కుటుంబానికి ఊరట

ఫిలిప్పీన్స్‌ పర్యటన వేళ.. ప్రపంచ నేతలకు మోదీ అపురూప బహుమతులు

Updated Date - Nov 18 , 2026 | 06:15 PM