విటమిన్ బీ12తో రీచార్జబుల్ బ్యాటరీ తయారీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:35 AM
మానవ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమైన పోషకపదార్థంగా పేరొందిన విటమిన్ బీ12తో శాస్త్రవేత్తలు ఊహకందని ఆవిష్కరణ చేశారు.
న్యూఢిల్లీ, నవంబరు 18: మానవ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమైన పోషకపదార్థంగా పేరొందిన విటమిన్ బీ12తో శాస్త్రవేత్తలు ఊహకందని ఆవిష్కరణ చేశారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కార్డబోకు చెందిన పరిశోధకులు విటమిన్ బీ12ను ఉపయోగించి సరికొత్త రీచార్జ్‌బుల్ జింక్ ఎయుర్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగాత్మక బ్యాటరీని 250 సార్లు వరకు రీచార్జ్ చేసుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా ఈ విటమిన్ బీ12 బ్యాటరీలు నిలుస్తాయని తెలిపారు. విటమిన్ బీ12లోని కోబాల్ట్ అనే మూలకం బ్యాటరీలో రసాయన చర్యలను వేగవంతం చేసే ఉత్ర్పేరకంగా పని చేస్తుంది. బ్యాటరీ విద్యుత్‌ను విడుదల చేసే సమయంలో ఆక్సిజన్‌ను నీరుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. తిరిగి చార్జింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. జింక్, గాలిలోని ఆక్సిజన్‌తో పని చేసే ఈ జింక్ ఎయిర్ బ్యాటరీలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే తక్కువ బరువు కలిగి ఉంటాయని, భద్రతపరంగా కూడా ఎంతో సురక్షితమైనవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు