నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:59 AM
ఎల్నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను ఎదుర్కొవడానికి, పాఠశాలల్లో విద్యార్థులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను ఎదుర్కొవడానికి, పాఠశాలల్లో విద్యార్థులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉదయం పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులతో జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించనున్నారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగింటిపోవడంతో తాగునీటికి సమస్య తలెత్తుతున్న ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు నీటి పొదుపు పాఠాలు బోధించాలని హైదరాబాద్ మహానగర నీటిసరఫరా, మురుగునీటి పారుదల మండలి (హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి) ఎండీ కె. అశోక్ రెడ్డి పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోల్సకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన నవీన్ నికోలస్, అన్ని పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని కోరుతూ బుధవారం విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News