Share News

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:45 PM

సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Sathya Sai Baba Birthday, Special Trains

గుంతకల్లు(అనంతపురం): సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అన్‌ రిజర్వుడు రైలును ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకూ నడుపుతామన్నారు. బెంగళూరు-ధర్మవరం (06525) ప్రత్యేక అన్‌ రిజర్వుడు రైలు పేర్కొన్న తేదీల్లో ఏడు రోజులపాటు నడుస్తుందన్నారు. ఈ రైలు బెంగళూరులో ఉదయం 8-15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండున్నరకు ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (06526) ధర్మవరంలో మధ్యాహ్నం 1-20 గంటలకు బయలుదేరి సాయంత్రం 5-50 గంటలకు బెంగళూరుకు చేరుతుందన్నారు. ఈ రైలు బెంగళూరు కంటోన్మెంటు, బయ్యపనహళ్లి, యల్హంక, రాజన్‌కుంటి, దొడ్డబళ్లాపూర్‌, ఒడ్డరహళ్లి, మాకాళిదుర్గ, తొండేబావి, గౌరీబిదనూరు, దేవనహళ్లి, హిందూపురం, మలుగూరు, చాకర్లపల్లి, పెనుగొండ, నారాయణపురం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, బసంపల్లి స్టేషన్ల మీదుగా ధర్మవరంకు చేరుతుందన్నారు. ఈ రైలుకు 16 మెము కోచ్‌లను వేయనున్నట్లు తెలియజేశారు.


train.jpgసంత్రగాచి నుంచి ఎస్‌ఎస్పీఎన్‌కు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌

సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సంత్రగాచి-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-సంత్రగాచి మధ్య రెండు అప్‌ అండ్‌ డౌన్‌ ట్రిప్పుల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంత్రగాచి-ఎ్‌సఎ్‌సపీఎన్‌ ప్రత్యేక రైలు (08031) ఈ నెల 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 12-40 గంటలకు సంత్రగాచిలో బయల్దేరి రెండో(19, 26 తేదీల్లో) రాత్రి తొమ్మిదిన్నరకు ఎస్‌ఎ్‌సపీఎన్‌ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు ఈ నెల 18, 25 తేదీల్లో ఎస్‌ఎ్‌సపీఎన్‌ స్టేషన్‌లో రాత్రి 11 గంటలకు బయలుదేరి రెండో రోజు (20, 27 తేదీల్లో) ఉదయం 8 గంటలకు సంత్రగాచి స్టేషన్‌కు చేరుతుందన్నారు. ఖరగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జైపూర్‌కేయోంజ్‌హర్‌ రోడ్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుద్రారోడ్‌, బ్రహ్మపూర్‌, పలాస, వి జయనగరం, దువ్వాడ, సామర్లకోట్‌, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నం ద్యాల, డోన్‌, గుత్తి, ధర్మవరం మీదుగా ఎస్‌ఎ్‌సపీఎన్‌ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు.


యశ్వంతపూర్‌-గుంతకల్లు మధ్య..

సత్యసాయి జయంతిని పురస్కరించుకుని యశ్వంతపూర్‌-గుంతకల్లు మధ్య ఏడు ట్రిప్పుల అప్‌ అండ్‌ డౌన్‌ డెయిలీ ప్రత్యేక ప్యాసింజరు రైలును నడుపనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈరైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ నడుస్తాయన్నారు. యశ్వంతపూర్‌-గుంతకల్లు ప్రత్యేక ప్యాసింజరు (56532) ప్రత్యేక రైలు యశ్వంతపూర్‌లో ఉదయం 5-45 గంటలకు బయలుదేరి ఉదయం పదకొండున్నరకు గుంతకల్లుకు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (56532) మధ్యాహ్నం పన్నెండున్నరకు గుంతకల్లులో బయలుదేరి సాయంత్రం 6-45 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుతుందన్నారు. ఈ రైలు వెంకటాంపల్లి, కల్లూరు, అనంతపురం, జంగాలపల్లి, ధర్మవరం, ఎస్‌ఎ్‌సపీఎన్‌, పెనుగొండ, చాకర్లపల్లి, హిందూపురం స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు

గెలిపించిన వాడు.. ఓటమిని నేర్పించని వాడు.. ధోనీపై బాలయ్య ప్రశంసలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 12:45 PM