Share News

పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:03 PM

వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు
Pulivendula News

కడప, నవంబర్ 18: జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చక్రాయపేట, వేంపల్లి, వేముల మండలాల్లో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు తీవ్రరూపం దాల్చి ఏకంగా దాడులకు దారితీసినట్లు తెలుస్తోంది.


చక్రాయపేట మండలం సురభి నాగులగుట్టపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుకుంది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు వేముల మండల కేంద్రంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అలాగే వేంపల్లెలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు వెళ్లాయి. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 12:17 PM