నందికొట్కూరు ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:29 PM
నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి, పాములపాడు ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
నంద్యాల, నవంబర్ 18: జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి, పాములపాడు ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కొత్తపల్లి మండలంలో మొత్తం 9 ఎంపీటీసీలలో టీడీపీ-4, వైసీపీ-4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఒక స్థానంపై వివాదం నెలకొనడంతో టీడీపీ వర్గం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అటు పాములపాడు మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీలలో వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ 5 స్థానాల్లో గెలుపొందగా.. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఇండిపెండెంట్ మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీలకు సమబలం వస్తే లాటరీ పద్ధతి ద్వారా ఎంపీపీని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జొన్నగిరి సర్పంచు స్థానానికి తీవ్ర పోటీ
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి సర్పంచు స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. తనను సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.75 లక్షల చేసే విలువైన మూడు ఎకరాల పొలాన్ని గ్రామానికి రాసిస్తానని పుల్లన్న అనే వ్యక్తి దండోరా వేయించాడు. అయితే రూ.25 లక్షలు గ్రామానికి ఇస్తానంటూ మరోవ్యక్తి సుంకన్న దండోరా వేయించారు. ఈ క్రమంలో సర్పంచు స్థానం ఎవరికి వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు
పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు
Read Latest AP News And Telugu News