Share News

అరకులోయలో యువతి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:10 PM

అల్లూరి జిల్లాలోని అరకులోయలో యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

అరకులోయలో యువతి అనుమానాస్పద మృతి
Araku Valley Woman News

అల్లూరి జిల్లా, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లాలోని అరకులోయలో యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చొంపి జంక్షన్ సమీపంలోని హైవే బ్రిడ్జి కింద వాగులో యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలిని డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థిని మీనా (20)గా గుర్తించారు. యువతి ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో, ఆమెను కొట్టి హత్య చేసి వాగులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిది అనుమానాస్పద మృతిగా అరకులోయ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 12:32 PM