Share News

భాగ్యనగరవాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలివే..

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:36 PM

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు.

భాగ్యనగరవాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలివే..
Khairatabad Ganesh Traffic Restrictions

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ (Khairatabad Ganesh Traffic Restrictions) చుట్టూ పక్కల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. భక్తులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బడా గణేశ్‌ను దర్శించుకోవడానికి సుమారు ముప్పై లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. స్థానికంగా ఇక్కడ నివసించేవారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయని వెల్లడించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు పోలీసుల సూచనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.


ఖైరతాబాద్ బడా గణేశ్ వద్దకు చేరుకోవడానికి ముఖ్యంగా నాలుగు దారులివే..

‘ఖైరతాబాద్ బడా గణేశ్ వద్దకు చేరుకోవడానికి ముఖ్యంగా నాలుగు దారులు ఉంటాయి. మెట్రో వైపు నుంచి, ద్వారకా హోటల్ వైపు ఉండి, మింట్ కాంపౌండ్ వైపు నుంచి, బడా గణేశ్ వెనక ఉండే బస్తీ వైపు నుంచి ఖైరతాబాద్ వినాయకుడు వైపు వచ్చే మార్గాలు ఉంటాయి. మెట్రో వైపు నుంచి ఎక్కువ మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడు వైపు వచ్చే అవకాశం ఉంది. బడే గణేశ్‌ను దర్శించుకోవాలనుకునేవారు మెట్రోలో ప్రయాణం చేయాలని, ఎంఎంటీఎస్ సేవలు వాడుకోవాలి. ఖైరతాబాద్ మీదుగా సుమారు 2200 ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. బస్సు సర్వీస్‌లను వినియోగించుకోవాలి. ప్రజా రవాణాను వినియోగిస్తే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. సాధారణంగా మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం లోపు బడా గణేశ్‌ను దర్శించుకుంటే సాయంత్రం రద్దీని నియంత్రించవచ్చు. భక్తులు వీకెండ్స్ కాకుండా సాధారణ రోజుల్లో గణేశ్‌ను దర్శించుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కాకుండా వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు కార్ పూలింగ్‌ను చేసుకోవాలి. ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం వచ్చేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశాం’ అని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.


వాహనాల పార్కింగ్ కోసం..

‘సెక్రటేరియట్ వైపు నుంచి వచ్చే వారి కోసం ఐమాక్స్ గ్రౌండ్ హెచ్ఎండీఏ పార్కింగ్, ఈ రేసింగ్ పార్కింగ్‌లలో ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ ఫుల్ అయితే నెక్లెస్ రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ వైపు నుంచి వచ్చే వారి కోసం విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశాం. టెలిఫోన్ భవన్ వద్ద లిమిటెడ్ పార్కింగ్ ఉంటుంది. ఎన్టీఆర్ మార్గ్ నుంచి వచ్చి ఖైరతాబాద్ గణేశుడును దర్శించుకోవనికి వస్తే పార్కింగ్ సులువుగా ఉంటుంది. ఓలా, ఉబర్‌లను బుక్ చేసుకోవడానికి రోడ్డు మధ్యలో కాకుండా మెట్రో ఎంఎంటీఎస్ గ్రౌండ్ వైపు ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించుకోవడానికి మెట్రోలో వచ్చేవారు స్వామివారిని కూర్చోబెట్టిన వైపు దిగాలి. అలాకాకుండా వ్యతిరేక దిశలో దిగితే రోడ్డు దాటాల్సి ఉంటుంది.. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మెట్రోస్టేషన్‌లలో కూడా బడా గణేశ్ దర్శనం కోసం ఎటువైపు దిగాలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాం. రాంగ్ రూట్‌లో రావద్దని.. పార్కింగ్ సమస్యలు క్రియేట్ చేయొద్దు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు ఖైరతాబాద్ బడా గణేశ్‌‌ను దర్శించుకోడానికి వస్తారని.. కాబట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా భక్తులు పోలీసుల సూచనలు పాటించాలి. ఖైరతాబాద్ బడా గణేశ్ చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం 500 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. వీఐపీలను ఎప్పటిలాగే రాజ్ దూత్ మార్గం నుంచి అనుమతిస్తాం’ అని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేత్రపర్వంగా ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన్

చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 05:27 PM