Share News

చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:25 PM

చేయూత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం మంజూరులో నిబంధనలను ప్రభుత్వం సవరించింది.

చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Telangana Cheyutha Pension Scheme

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): చేయూత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం మంజూరులో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. విడిపోయిన కాలానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో స్థానిక విచారణకు కొత్త అధికారులకు బాధ్యతలు అప్పగించింది.


తహసీల్దార్‌తో పాటు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌లను స్థానిక విచారణ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. చేయూత పెన్షన్లలో అర్హుల గుర్తింపునకు అధికారుల పరిధిని విస్తరించింది. సెర్ప్ ప్రతిపాదనల మేరకు నిబంధనల్లో తెలంగాణ సర్కార్ మార్పులు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. సీపీ సజ్జనార్‌కి ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి ఘటన.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 07:17 PM