హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసింది: హరీశ్‌రావు
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:31 PM
కేసీఆర్ పాలన ప్రజల కేంద్రంగా సాగితే.. రేవంత్ పాలన భూముల కేంద్రంగా నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ పాలన ప్రజల కేంద్రంగా సాగితే.. రేవంత్ పాలన భూముల కేంద్రంగా నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 22A బాధితులతో హరీశ్‌రావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్కులు, ప్లాట్లు, ప్రభుత్వ స్థలాలు.. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు.
భావి తరాలకు జాగా లేకుండా చేస్తున్నారు..
ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటూ.. భావి తరాలకు జాగా లేకుండా చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజల ఆస్తులనేమో 22-ఏ నిషేధిత జాబితాలోకి.. ప్రభుత్వ భూములనేమో రేవంత్ సోదరుల చేతుల్లోకి నెడుతున్నారని ఆక్షేపించారు. లక్షల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు కమీషన్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎప్పుడు హైడ్రా వస్తుందో.. ఎప్పుడు 22-ఏ కింద భూమి లాక్కుంటారోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో 22-ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలను, హైదరాబాద్‌లోనే లక్షలాది ఆస్తులను రేవంత్ ప్రభుత్వం 22-ఏలో చేర్చిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుతూ 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో 22-ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. బ్రోకర్లకు ఎవరూ ఒక్క రూపాయి ఇవ్వొద్దని.. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత బీఆర్‌ఎస్‌దేనని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News