మాజీ మంత్రి కేటీఆర్‌కి కాంగ్రెస్ బర్త్‌డే గిఫ్ట్
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:33 PM
మాజీ మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సన్నబియ్యాన్ని పంపించింది.
హైదరాబాద్, జులై 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు (KTR Birthday) కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సన్నబియ్యాన్ని పంపించింది. కేటీఆర్ పేరుతో తెలంగాణ భవన్‌కి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పంపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న సన్నబియ్యాన్ని ర్యాపిడోలో కేటీఆర్‌కి పంపించినట్లు తెలిపారు.
ప్రతి ఇంట్లో పండగ రోజులు..
దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని మెట్టు సాయి కుమార్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే పండుగా చేసుకునే వారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంట్లో పండగ రోజులను తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటికెళ్లి సన్నబియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
25 కేజీల సన్నబియ్యం..
25 కేజీల సన్నబియ్యాన్ని కేటీఆర్ పుట్టినరోజు కానుకగా పంపుతున్నామని మెట్టు సాయి కుమార్ తెలిపారు. ప్రతి నెల ఈవిధంగానే కేటీఆర్‌కి తాము పంపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అందరు సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారని ఉద్ఘాటించారు. నిరుపేద కుటుంబం కళ్లలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ సన్నబియ్యం అన్ని పార్టీల వారు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అందరు తినొచ్చని వివరించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. దేశంలో మరెక్కడ లేవని మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్
విద్యార్థులపై లాఠీఛార్జ్ కాదు.. కేంద్రం సమాధానమివ్వాలి: కమల్ హాసన్
రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News