Share News

ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్

ABN , Publish Date - Jul 23 , 2026 | 08:51 AM

మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలాన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు నమోదు చేశారు.

ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్
Trainee IPS Uday Krishna Reddy Case

హైదరాబాద్, జులై 23 (ఆంధ్రజ్యోతి): మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలాన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు నమోదు చేశారు. డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా ఆమెతో పాటు పలువురు ట్రైనీ ఐపీఎస్ అధికారుల స్టేట్‌మెంట్లను కూడా రికార్డ్ చేశారు.


ఈ కేసు దర్యాప్తు సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన, వ్యవహార శైలి గురించి ఎన్‌పీఏ సిబ్బంది, సహచర ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలిస్తూ అధికారులు ఆధారాల సేకరిస్తున్నారు.


ఇదిలా ఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే ఆయన వాంగ్మూలాన్ని కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు నమోదు చేయనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వివరణను తీసుకుని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


మరోవైపు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేసు దర్యాప్తు కొనసాగేందుకు మార్గం సుగమమైంది.


ఎఫ్‌ఐఆర్ క్వాష్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో తదుపరి వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో దర్యాప్తు పురోగతి, కోర్టు విచారణ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మహిళ ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన వాంగ్మూలం, ఇతర సాక్షుల ప్రకటనలు కేసు దిశను ప్రభావితం చేసే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి...

గుడ్ న్యూస్.. తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్ర ఆమోదం

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

రామచందర్ రావును వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 09:12 AM