‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:30 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పైన విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’ (ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ)పైన విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు. ఈరోజు (గురువారం) నాంపల్లి గ్రౌండ్‌లో సంవిధాన్ గౌరవ్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని, మాట్లాడారు. ఉన్నత వర్గాల వారికే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని రేవంత్‌రెడ్డి చెసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ చురకలు అంటించారు. బీజేపీ చరిత్రలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ అవకాశాలు కల్పించిందో తెలుసుకోవాలని పేర్కొన్నారు.
దేశంలో అక్రమ చొరబాటు ఆగింది..
2014 తర్వాత దేశంలో అక్రమ చొరబాటు ఆగిందని బండి సంజయ్ తెలిపారు. కానీ కాంగ్రెస్ అందుకు భిన్నంగా ఓట్ల కోసం ఇతర దేశాల వాళ్లకు ఓటు హక్కు కల్పించి లబ్ధి పొందారని అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని హేళన చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహించారు. మహిళ గవర్నర్‌ను అవమానించారని దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా కేసీఆర్ చూశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే బాటలో రేవంత్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ను అగౌరవపరిచిన కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ , కేసీఆర్ అత్యంత దారుణంగా అవమానించారని బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ
నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News