కాంగ్రెస్‌లో ఎక్కడా వర్గ పోరు లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ABN , Publish Date - Sep 04 , 2026 | 03:41 PM
కాంగ్రెస్‌లో ఎక్కడా వర్గ పోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. నేతలు అందరం కాంగ్రెస్ బలోపేతం కోసమే పని చేస్తున్నామని పేర్కొన్నారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో ఎక్కడా వర్గ పోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి (Telangana Minister Vivek Venkat Swamy) వ్యాఖ్యానించారు. నేతలు అందరం కాంగ్రెస్ బలోపేతం కోసమే పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) మంచిర్యాలలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వేయి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని తెలిపారు.
ఆ జీవోను పున:పరిశీలన చేస్తున్నాం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేక పోయిన తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 22ఏ భూముల సమస్య గత బీఆర్ఎస్ ప్రభుత్వ పుణ్యమేనని, ఆ జీవోను పున:పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరిస్తామని మాటిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు కుగిందనే విషయంపై హరీశ్‌రావు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి
22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్
హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News