రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం: మహేశ్వర్ రెడ్డి
ABN , Publish Date - May 28 , 2026 | 10:01 AM
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
నిర్మల్ జిల్లా, మే 28 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఈరోజు (గురువారం) కడెం మండలంలో ‘రైతుగోస- బీజేపీ భరోసా యాత్ర’ నిర్వహించారు. పెద్దూర్‌తండాలో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్ పరిశీలించారు.
ధాన్యం కుప్పలు కనపడట్లేదా..?
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. 80శాతం ధాన్యం కొనుగోలు చేశామని చెప్పు కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు కనపడట్లేదా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ధాన్యం తరలింపు పనులను వేగవంతం చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
40శాతం ధాన్యం కూడా కొనలేదు..
పంటలు పండించడం ఒక ఎత్తయితే... ఆ పంటలను అమ్ముకోవడం మరో టాస్క్‌గా మారిందని అన్నారు. నెలరోజులైనా 40శాతం ధాన్యం కూడా కొనలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. వర్షం భయంతో పంట కల్లాల వద్ద రైతులు పడికాపులు కాస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయినా ఏ మంత్రి కూడా ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి తరుగు, కోతలు లేకుండా కొనుగోలు చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News