Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jan 31 , 2026 | 07:22 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Jan 31, 2026 21:52 IST

    అంబటిని తక్షణమే అరెస్టు చేయాలి: ప్రభుత్వ విప్

    • అనంతపురం: అంబటి రాంబాబును తక్షణమే అరెస్టు చేయాలి..

    • అంబటిపై కేసు పెట్టి జైలుకు పంపాలి: ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు

  • Jan 31, 2026 21:50 IST

    అంబటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: మంత్రి టీజీ భరత్

    • అనంతపురం: అంబటి రాంబాబు జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..

    • అంబటిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: మంత్రి టీజీ భరత్

  • Jan 31, 2026 21:41 IST

    అంబటి వ్యాఖ్యలపై ఆందోళన, ఫిర్యాదులు..

    • ప్రకాశం : వైసీపీ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కందుకూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన..

    • కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో అంబటి దిష్టిబొమ్మ దహనం..

    • అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్..

    చీరాల వన్ టౌన్‌లో ఫిర్యాదు..

    • బాపట్ల : వైసీపీ నేత అంబటి రాంబాబుపై చీరాల వన్ టౌన్‌లో ఫిర్యాదు.,

    • సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్..

  • Jan 31, 2026 21:37 IST

    అంబటి వ్యాఖ్యలపై.. నేతలు, మంత్రుల కౌంటర్లు..

    • అంబటి రాంబాబు బరితెగించారు: కేంద్ర మంత్రి పెమ్మసాని

    • తరిమికొట్టినా వైసీపీకి బుద్ధి రాలేదు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

    • అంబటి రాంబాబు పశువులా మాట్లాడారు: దేవినేని ఉమ

    • అంబటి రాంబాబు మానసిక స్థితి బాగోలేదు: వాసంశెట్టి

    • అంబటి నోరు అదుపులో పెట్టుకోవాలి: శ్రీనివాస్‌ రెడ్డి

    • అంబటిపై కచ్చితంగా కేసు నమోదు చేస్తాం: హోంమంత్రి అనిత

  • Jan 31, 2026 21:35 IST

    రాజకీయ కుట్రలా అనిపిస్తోంది: విష్ణు కుమార్ రాజు

    • విశాఖపట్నం: సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు

    • వ్యక్తిగత దూషణలను సభ్య సమాజం సైతం సహించదు.. ఇది మంచి పద్ధతి కాదు..

    • సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం.. రాజకీయ కుట్రలా అనిపిస్తోంది: విష్ణు కుమార్ రాజు

  • Jan 31, 2026 21:29 IST

    అంబటిపై ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఆగ్రహం

    • అంబటి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి..

    • అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయి..

    • ఏపీలో అభివృద్ధి జరగకుండా ఉండేందుకు జిత్తులమారి ప్రయత్నాలు చేస్తున్నారు..

    • వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సతీమణినే దూషించి పాపం మూటకట్టుకున్నారు..

    • ఇప్పుడు సీఎం చంద్రబాబును దూషిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు..

    • అంబటి భేషరతుగా క్షమాపణ చెప్పాలి.. చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి: టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు

  • Jan 31, 2026 21:20 IST

    అంబటి గురించి మాట్లాడాలంటేనే సిగ్గు అనిపిస్తోంది: హోంమంత్రి

    • సీఎం చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడితే చర్యలు తప్పవు: అనిత

    • వైసీపీ నేతలు దిగజారి రాజకీయం చేస్తున్నారు: హోంమంత్రి

    • రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు: అనిత

    • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు: హోంమంత్రి అనిత

  • Jan 31, 2026 21:18 IST

    అంబటి రాంబాబుపై కూటమి నేతల ఫిర్యాదు..

    • ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కూటమి నేతల ఆగ్రహం..

    • అంబటిపై తిరువూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు..

  • Jan 31, 2026 21:15 IST

    అంబటి వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

    • కృష్ణా: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

    • వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక జగన్ రెడ్డి కుట్ర ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర

  • Jan 31, 2026 20:43 IST

    అంబటి వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

    • అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

    • అంబటి వ్యాఖ్యలు అత్యంత హేయనీయం: బీజేపీ

    • ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం..

    • ప్రజాస్వామ్య విలువలకు ఇది విరుద్ధం..

    • అంబటిని వైసీపీ వెంటనే సస్పెండ్ చేయాలి: బీజేపీ

  • Jan 31, 2026 20:34 IST

    బీఆర్ఎస్ నేతలతో ముగిసిన కేసీఆర్ సమావేశం..

    • సిద్దిపేట: ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో ముగిసిన మాజీ సీఎం కేసీఆర్ సమావేశం..

    • ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

    • కేసీఆర్‌తోనే ఫామ్ హౌస్‌లో ఉన్న మాజీ ఎంపీ సంతోష్ రావు..

    • రేపు ఉదయం 9 గంటలకు సిట్ విచారణ కోసం ఎర్రవల్లి నుంచి నందినగర్ వెళ్లనున్న బీఆర్ఎస్ అధినేత.

  • Jan 31, 2026 19:15 IST

    ములుగు: మేడారం మహాజాతర ముగింపు ఘట్టం ప్రారంభం.

    • డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో గద్దెలపైకి చేరుకున్న ఆదివాసి పూజారులు.

    • సమ్మక్కను చిలకలగుట్ట, సారలమ్మను కన్నెపల్లి, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లే పూజలు ప్రారంభం.

  • Jan 31, 2026 19:04 IST

    చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యల పట్ల ప్రత్తిపాటి ఆగ్రహం

    • చంద్రబాబుపై నోరు పారేసుకుంటే గుర్తింపు వస్తుందనుకోవడం అవివేకం.

    • అహంకారంతో విర్రవీగితే.. వైసీపీకి ప్రజలు సమాధి కడతారు.

  • Jan 31, 2026 19:04 IST

    ములుగు: కాసేపట్లో మేడారం మహాజాతర ముగింపు ఘట్టం

    • సమ్మక్క వన ప్రవేశంతో జాతర ముగింపు.

    • కాసేపట్లో సమ్మక్క వన ప్రవేశ పూజలు ప్రారంభం.

    • గద్దెలను శుభ్రం చేస్తున్న సిబ్బంది.

    • మరోవైపు దర్శనాల కోసం పోటెత్తిన భక్తులు.

  • Jan 31, 2026 19:03 IST

    గుంటూరు: అంబటి ఇంటి దగ్గర ఉద్రిక్తత

    • అంబటి ఇంటి దగ్గర టీడీపీ శ్రేణుల ఆందోళన.

    • నవభారత్‌నగర్‌లోని అంబటి నివాసం దగ్గర పోలీసుల మోహరింపు.

  • Jan 31, 2026 19:02 IST

    అమరావతి: చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సవిత

    • చంద్రబాబు మాతృమూర్తిని దూషించడం క్షమించరాని నేరం.

    • తక్షణమే అంబటి రాంబాబును అరెస్టు చేయాలి.

    • వైసీపీ నాయకులు రౌడీల్లా చెలరేగిపోతున్నారు.

    • తల్లన్నా, చెల్లెలన్నా, మహిళలన్నా గౌరవం లేదు.

    • జగన్, వైసీపీ నాయకులు రాజకీయాలకు అనర్హులు.

    • తక్షణమే వైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలి.

  • Jan 31, 2026 18:59 IST

    గుంటూరు: నేను చంద్రబాబును దూషించలేదు: అంబటి రాంబాబు

    • చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు.

    • నేను కార్యకర్తల్ని తిట్టి ఉండాల్సింది కాదు.

    • ఇంత పెద్ద వయస్సులో నేను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.

    • బూతులు మాట్లాడానన్న మనోవేదన నాలో ఉంది‌.

    • చంద్రబాబును తిట్టాల్సిన అవసరం లేదు‌.. రాజకీయ విమర్శ చేస్తా.

    • అరెస్టు చేస్తే సిద్ధంగా ఉన్నాను.. భయపడేది లేదు.

    • ముందస్తు బెయిల్ కూడా తీసుకోను.

    • లాయర్‌గా ఉన్నాను.. చట్టం తెలుసు నాకు.

  • Jan 31, 2026 18:48 IST

    విజయవాడ: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు.

    • పటమట యన్టీఆర్‌ సర్కిల్ వద్ద అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసిన టిడిపి నేతలు.

    • డౌన్ డౌన్ అంబటి రాంబాబు అంటూ నినాదాలు.

    • అంబటిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.

  • Jan 31, 2026 18:41 IST

    అమరావతి: అంబటి రాంబాబుపై మంత్రి అనగాని ఫైర్

    • అంబటి రాంబాబు వీధి రౌడీ కన్నా నీచంగా మాట్లాడారు.

    • అంబటి లాంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగులు.

    • చంద్రబాబును దారుణంగా దూషించిన అంబటికి కఠిన శిక్ష పడాల్సిందే.

    • దిగజారి బూతులు మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటు.

  • Jan 31, 2026 18:04 IST

    హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఆర్టీసీ బస్ భవన్‌లో అగ్ని ప్రమాదం

    • సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు.

    • సెల్లార్‌లో ఉన్న యూపీఎస్‌లు పూర్తిగా దగ్ధం.

    • ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బందిలో భయాందోళన.

    • సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది.

    • మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది.

  • Jan 31, 2026 16:43 IST

    ఎస్‌బీఐ ఏటీఎం కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు.

    • కాచిగూడ రైల్వేస్టేషన్‌ వరకు ఆటోలో వెళ్లిన నిందితులు.

    • ఆటో డ్రైవర్‌ను విచారించిన పోలీసులు.

    • నిందితుల మాటలు ఢిల్లీ వాసులుగా ఉన్నాయన్న డ్రైవర్‌.

    • కాల్పులకు ముందు బస్టాప్‌లో ఫోన్‌లో మాట్లాడిన నిందితులు.

    • నెట్‌వర్క్‌ డంప్‌ నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు.

  • Jan 31, 2026 15:59 IST

    ఆదివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు.

    • కేసీఆర్‌కు సిట్ నోటీసులు వ్యతిరేకిస్తూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు.

    • కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను రేవంత్ సర్కార్ వేధిస్తోందని బీఆర్ఎస్ నేతల ఆరోపణ.

  • Jan 31, 2026 15:41 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత.

    • డీఆర్ఐ హైదరాబాద్ - చెన్నై జోనల్ యూనిట్ల సంయుక్త ఆపరేషన్‌.

    • 9.5 కోట్లు విలువైన 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్.

    • ఏడుగురు నిందితుల అరెస్ట్.

    • బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్‌వేస్ విమానంలోని ట్రాలీ బ్యాగుల్లో గంజాయి దాచినట్లు గుర్తింపు.

  • Jan 31, 2026 15:27 IST

    ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీలో పొంగులేటి ప్రచారం

    • బీఆర్ఎస్ పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు: పొంగులేటి

    • పేదల కోసం గత పాలకలు ఏ ఒక్క పని చేయలేదు: పొంగులేటి

    • గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదు: పొంగులేటి

    • అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి

    పూర్తికథనం..

  • Jan 31, 2026 15:21 IST

    నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణ హత్య.

    • ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మహిళ.

    • ప్రియుడు నగేష్‌ యాదవ్‌ భార్య మమత(25)పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సుజాత.

    • అరునెలల బాబుకు కూడా నిప్పంటుకోవడంతో తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు.

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మమత మృతి.

    పూర్తికథనం

  • Jan 31, 2026 15:14 IST

    2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ.

    • రూ. 11,460 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కౌన్సిల్.

    • జీహెచ్‌ఎంసీకి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం రూ. 6,441కోట్లు.

    • జీహెచ్ఎంసీ ఖర్చు రూ.4,057కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 2,384కోట్లు.

    • జీహెచ్ఎంసీ రెవెన్యూ గ్రాంట్స్ రూ. 400కోట్లు.

    • కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ. 2,260కోట్లు కేటాయింపు.

    • విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ రూ.1,860కోట్లు.

  • Jan 31, 2026 12:54 IST

    గతంలో ఫాంహౌస్‌ నుంచే పాలన జరిగింది: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

    • ఇప్పుడు సిట్ విచారణ కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే జరిగేలా ఉంది: రాంచందర్‌రావు

    • కేసీఆర్‌పై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ?: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

  • Jan 31, 2026 12:53 IST

    మేడారంలో బస్సుల ఆలస్యంతో భక్తుల ఆగ్రహం

    • తాత్కాలిక బస్టాండ్ దగ్గర భక్తుల ఆందోళన

    • బస్టాండ్ వద్ద బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

    • రిటర్న్ జర్నీపై చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగం

    • వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్టాండ్

    • మేడారంలో ఇంకా కంట్రోల్‌కు రాని ట్రాఫిక్

  • Jan 31, 2026 12:50 IST

    వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్

    • జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ: మంత్రి రవికుమార్

    • వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి రవి

    • తిరుమలకి ఉన్న గౌరవాన్ని వైసీపీ భ్రష్టుపట్టించింది: మంత్రి గొట్టిపాటి

    • టీటీడీకి డిక్లరేషన్ సమర్పించే కార్యక్రమాన్ని జగన్ తుంగలో తొక్కారు: మంత్రి గొట్టిపాటి

    పూర్తి కథనం

  • Jan 31, 2026 11:13 IST

    తీవ్ర విషాదం

    • హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

    • చర్లపల్లి- ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఆత్మహత్య

    • మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా గుర్తింపు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 10:56 IST

    మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

    • తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్

    • పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు

    • మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను సీఎంకు వివరించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    • కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్‌ పెట్టిన సీఎం రేవంత్

    పూర్తి కథనం

  • Jan 31, 2026 10:20 IST

    రూ.54 లక్షల మోసం

    • హైదరాబాద్‌: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ పరిచయంతో రూ.54 లక్షల మోసం

    • రైల్వే ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో నమ్మించిన ముషీరాబాద్‌ యువతి

    • క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో 29 విడతల్లో రూ.54 లక్షల వసూలు

    • లాభాలు విత్‌డ్రా చేయాలంటే అదనపు ఫీజు కోరడంతో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 10:18 IST

    ఏలూరు: జిల్లాలో మళ్లీ పులి కలకలం

    • పోలవరం మండలం ఇటుకల కోట దగ్గర పులి సంచారం

    • రెండు లేగ దూడలపై దాడి చేసి చంపిన పులి

    • పులి పాదముద్రలను సేకరిస్తున్న ఫారెస్ట్ అధికారులు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 09:15 IST

    బెంగళూరు HSR లేఅవుట్‌ టీచర్స్ కాలనీలో దారుణం

    • మహిళపై తీవ్రంగా దాడి చేసిన ఎదురింటి వారి కుక్క

    • తీవ్రంగా గాయపడిన మహిళ శరీరానికి 50కుట్లు వేసిన వైద్యులు

    • నెట్టింట వైరల్‌గా మారిన మహిళపై దాడి ఘటన వీడియో

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:57 IST

    ఘోర ప్రమాదం

    • కాంగో: రుబయా ప్రాంతంలోని కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం

    • కార్మికులు పని చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిన గని

    • ఈ ప్రమాదంలో మట్టి కింద కూరుకుపోయి 200మంది మృతి

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:22 IST

    భారత్‌లో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

    • ఇవాళ ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,190

    • నిన్నటితో పోలిస్తే రూ.9,650 మేర తగ్గిన గోల్డ్ రేటు

    • 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,55,100

    • నిన్నటితో పోలిస్తే రూ.8,850 మేర తగ్గిన బంగారం రేటు

    • ప్రస్తుతం రూ.4,05,000 వద్ద ట్రేడవుతున్న కిలో వెండి

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:17 IST

    అమెరికా ఆర్థిక శాఖకు షాక్ ఇచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • అమెరికా అంతర్గత రెవెన్యూ సేవలు, ఆర్థిక శాఖపై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో దావా

    • తన వ్యాపార, వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల సమాచారం లీక్ కావడంతో పిటిషన్

    • 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేసిన ట్రంప్ తరఫు న్యాయవాది

    పూర్తి కథనం

  • Jan 31, 2026 08:14 IST

    హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

    • కోఠి SBI ఏటీఎం సెంటర్ దగ్గర దుండగుల కాల్పులు

    • రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6లక్షలు దోపిడీ

    • డిపాజిట్‌ చేయడానికి వచ్చిన రిన్షద్‌పై తుపాకీతో కాల్పులు

    • రిన్షద్ కాలికి గాయం, ఆస్పత్రికి తరలింపు

    • సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న సుల్తాన్‌బజార్ పోలీసులు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 07:27 IST

    కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

    • కడపల్లిలోని నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు

    • గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

    • శాంతిపురం మండలం తుమ్మిసిలో ఈ-సైకిల్ పంపిణీ కార్యక్రమం

    • తుమ్మిసి బహిరంగసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 07:26 IST

    యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానంలో డాలర్ల మాయం కేసు

    • బంగారం, వెండి డాలర్ల మాయం ఘటనలో ఈఓ భవానీశంకర్ చర్యలు

    • జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మి సస్పెషన్

    • విధుల్లో నిర్లక్ష్యం వహించిన పర్యవేక్షణ అధికారులకు మెమోలు, షోకాజ్ నోటీసులు

    పూర్తి కథనం

  • Jan 31, 2026 07:25 IST

    నంద్యాల డెయిరీ వ్యవహారం.. కమిటీ విచారణ..

    • నంద్యాల విజయ పాల డెయిరీలో నలుగురు సభ్యుల కమిటీ విచారణ

    • కార్మికుల చట్ట నిబంధనలు పాటించలేదని నిర్ధారణ

    • EPF, ESIలో లోపాలు గుర్తించిన నలుగురు సభ్యుల కమిటీ

    • త్వరలో కలెక్టర్‌కు సమగ్ర నివేదిక ఇవ్వనున్న కమిటీ

    • నెల కిందట జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేసిన కార్మికులు

  • Jan 31, 2026 07:22 IST

    ముంబై: నేడు NCP శాసనసభాపక్ష సమావేశం

    • శాసనసభాపక్ష నేతగా సునేత్రను ఎన్నుకోనున్న సభ్యులు

    • మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌

    • నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అజిత్‌ పవార్‌ సతీమణి

    • సునేత్ర పవార్‌కు క్రీడలు, ఎక్సైజ్‌ శాఖలు కేటాయింపు