Share News

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:44 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్
AP Minister Gottipati Ravi Kumar

పశ్చిమగోదావరి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్(AP Minister Gottipati Ravi Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ.. వైసీపీ అని ఎద్దేవా చేశారు. శనివారం భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.


మహిళల సాధికారతకు ఎన్టీఆర్ కృషి..

తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించి.. వారి సాధికారత కోసం ఎన్టీఆర్ కృషి చేశారని చెప్పుకొచ్చారు. సంక్షేమంలో ఎన్టీఆర్ స్ఫూర్తిని నేడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కొనసాగిస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.


వైసీపీ అసత్య ప్రచారం..

తిరుమలకి ఉన్న గౌరవాన్ని వైసీపీ భ్రష్టుపట్టించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ అయ్యారు. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహించారు. టీటీడీకి డిక్లరేషన్ సమర్పించడాన్ని జగన్ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. 70 శాతం పూర్తయిన పోలవరాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 12:50 PM