Share News

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

ABN , Publish Date - Jan 31 , 2026 | 09:45 AM

మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం అర్భన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదానికి కల్తీ నెయ్యి అందించడంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి
TDP Mla Dagupati Venkateshwara Prasad

అనంతపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) అనంతపురం అర్భన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్(TDP Mla Dagupati Venkateshwara Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదానికి కల్తీ నెయ్యి అందించడంపై ఆయన ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. అనంతపురంలోని పలు కాలనీల్లో శుక్రవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పాల్గొన్నారు.


కాసుల కక్కుర్తి కోసం..

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్ల అక్రమాలు జరిగాయని సిట్ అధికారులు నిర్ధారించారని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. కాసుల కోసం కక్కుర్తి పడి టీటీడీకి వైసీపీ నేతలు కల్తీ నెయ్యిని అంటగట్టారని మండిపడ్డారు. చుక్క పాలుకొనని కంపెనీలకు నెయ్యి సరఫరా ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో భక్తుల సౌకర్యాలను మరిచి కేవలం ధనార్జనకే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. వేంకటేశ్వరస్వామి భక్తుడైన సీఎం చంద్రబాబు.. తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ఐవీఆర్ఎస్ కాల్స్‌తో భక్తుల సౌకర్యాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. కూటమి హయాంలో నాణ్యమైన స్వామివారి ప్రసాదం లడ్డూను అందజేస్తున్నామని వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్

ఆ భూములపై వైసీపీ దౌర్జన్యం చేస్తోంది.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 10:20 AM