కాంగోలో కుప్పకూలిన గని.. 200 మంది దుర్మరణం..
ABN , Publish Date - Jan 31 , 2026 | 08:17 AM
తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని రుబయా ప్రాంతంలో ఉన్న కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా(Africa) దేశం తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో బుధవారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. రుబయా(Rubaya) ప్రాంతంలోని కోల్టన్ గని (Coltan mine) కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 200మందికి పైగా మృతిచెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
గని కూలిన సమయంలో అక్కడ కార్మికులు, పిల్లలు, మహిళలు మట్టిలో కూరుకుపోయారు. కొంతమంది గాయాలతో బయటపడగా వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నేల బలహీనపడి, గని ఒక్కసారిగా కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు. కోల్టన్ వంటి ఖనిజాల కోసం ఇల్లీగల్ గా జరిపే తవ్వకాలు ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు. ఉత్తర కిపు ప్రాంతంలోని రుబయా నగరం కోల్టన్ ఉత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఇవి కూడా చదవండి..
డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. రేపు ప్రమాణస్వీకారం
అజిత్ పవార్ శాఖలపై సీఎంను కలిసిన ఎన్‌సీపీ నేతలు
For More National News And Telugu News