విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:59 AM
హైదరాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్, జనవరి 31: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రైలుకింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి - ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా తెలుస్తోంది. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు జీఆర్‌పీ క్రైమ్ నంబర్ 57/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఇంకా ఇతర కారణాలా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యతో బోడుప్పల్ హరితహారం కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి...
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. చర్చించిన అంశాలివే
కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి
Read Latest Telangana News And Telugu News