-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 7th September 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 07 , 2026 | 07:18 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 07, 2026 07:54 IST
తిరుపతి: కొటాల-రామిరెడ్డిపల్లి మధ్య రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
మృతుడు నాగయ్యగారిపల్లికి చెందిన పార్థసారథి(55)గా గుర్తింపు
ఘటనా స్థలంలో స్కూటీని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
ప్రమాదమా లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసుల విచారణ
-
Sep 07, 2026 07:54 IST
మహబూబ్‌నగర్: అమ్రాబాద్‌లో దారుణహత్య
తండ్రి బురాన్‌ను చంపి గోనసంచిలో పెట్టిన తల్లి, కుమారుడు
మృతదేహం ఇంట్లో పెట్టి తల్లి, కుమారుడు పరారీ
దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికుల సమాచారం
-
Sep 07, 2026 07:54 IST
నేడు వరంగల్‌లో TRS చీఫ్ కవిత పర్యటన
విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్వాసితులతో భేటీకానున్న కవిత
-
Sep 07, 2026 07:53 IST
నేడు తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభం
సెంట్రల్ హాల్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సెంట్రల్ హాల్‌కు దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు
అనంతరం మంత్రులతో కలిసి సీఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ మీట్
-
Sep 07, 2026 07:47 IST
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసు
నేటితో ముగియనున్న ముగ్గురు నిందితుల కస్టడీ
రెండు రోజుల విచారణలో కీలక సమాచారం రాబట్టిన పోలీసులు
పరారీలో ఉన్న సుమంత్ కోసం కొనసాగుతున్న గాలింపు
-
Sep 07, 2026 07:45 IST
హైదరాబాద్: నర్సు శిరీష అత్యాచార అండ్ మర్డర్ కేసు
నిందితుడు సనావుల్లాఖాన్‌కు రెండురోజుల కస్టడీ
నేటి నుంచి రెండురోజుల పాటు విచారించనున్న పోలీసులు
ఇప్పటికే ఆధారాలను FSLకు పంపిన పోలీసులు
-
Sep 07, 2026 07:40 IST
తెలంగాణకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ
నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు వర్షాలు
-
Sep 07, 2026 07:40 IST
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం
ఉభయ సభలు ఉ.10 గంటలకు ప్రారంభం
వెయ్యి రోజుల పాలనపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశం
22A, కృష్ణాజలాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
పలు కీలక బిల్లులు, వార్షిక నివేదికలను సభ ముందుంచనున్న ప్రభుత్వం
-
Sep 07, 2026 07:39 IST
అమరావతి: నేడు, రేపు టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్
వర్క్‌షాప్‌నకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చ
-
Sep 07, 2026 07:39 IST
ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు
ఈ నెల 16 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 17 నుంచి 21 వరకు వెరిఫికేషన్
25, 26 తేదీల్లో పెన్షన్లను ఆమోదించనున్న ప్రభుత్వం
ప్రస్తుతం ఏపీలో సుమారు 62 లక్షల మందికి అందుతున్న పెన్షన్లు
-
Sep 07, 2026 07:35 IST
నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష
సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమ శాఖలపై ప్రత్యేక దృష్టి
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం
మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్‌లో మార్పులు, చేర్పులు
-
Sep 07, 2026 07:34 IST
ఢిల్లీ: సత్యనికేతన్‌లో భవనం కూలిన ఘటనలో ఆరుగురి మృతి
మరో 11 మందికి గాయాలు, పలువురిని కాపాడిన సిబ్బంది
శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Sep 07, 2026 07:34 IST
యూపీకి మరో 4 రోజులపాటు భారీ వర్ష సూచన
యూపీలోని 24 జిల్లాల్లో వరదల ప్రభావం
ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగా, యమున, ఘాగ్రా నదులు
-
Sep 07, 2026 07:31 IST
ఇండోనేషియాలో పేలిన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం
ఎనిమిది ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకల నిలిపివేత
ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న లక్షా 70 వేల మంది
-
Sep 07, 2026 07:24 IST
భారత్ నుంచి యూరప్‌నకు డీజిల్
ఆగస్టులో బాబ్ ఎల్ మండేబ్ మార్గం నుంచి రోజుకు 2లక్షల బ్యారెళ్ల డీజిల్/గ్యాసోయిల్ తరలింపు
ఇందులో 60 శాతం భారత్ ద్వారా సరఫరా
-
Sep 07, 2026 07:23 IST
నేడు కేంద్ర జల సంఘం కీలక సమావేశం
హాజరుకానున్న ఏపీ, తెలంగాణ ప్రతినిధులు
-
Sep 07, 2026 07:22 IST
నేడు తిరుపతికి యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్
సా.5 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న యోగి ఆధిత్యనాథ్