Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 05 , 2026 | 06:11 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Feb 05, 2026 21:47 IST

    తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం

    • మున్సిపల్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం.

    • మరోవైపు శనివారం, ఆదివారం.. రెండు రోజుల పాటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్.

    • జనసేన, బీజేపీ అభ్యర్థుల‌ తరుపున పవన్ ప్రచారం.

    Pawan-Kalyan.jpg

  • Feb 05, 2026 21:38 IST

    శుక్రవారం సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

    • కేసు విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం

    • ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామన్న ధర్మాసనం.

    • అనర్హత పిటిషన్‌లపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం.

    • తదుపరి విచారణ నాటికి స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని కోర్టుకు తెలపాలి: సుప్రీంకోర్టు

  • Feb 05, 2026 21:27 IST

    మేడారం హుండీల లెక్కింపు

    • మొత్తం 828 హుండీల్లో తొలిరోజు 125 హుండీలు లెక్కింపు.

    • తొలిరోజు హుండీల లెక్కింపులో రూ.2,49,65,000 ఆదాయం.

  • Feb 05, 2026 20:42 IST

    సీఎం రేవంత్‌ వ్యాఖ్యలను ప్రజలు ఛీకొడుతున్నారు: హరీష్‌రావు

    • కేసీఆర్‌ను జాతిపిత అన్నందుకు రేవంత్‌ విషం కక్కుతున్నారు.

    • కేసీఆర్‌ను జాతిపితగా పిలుచుకుంటే రేవంత్‌కు ఏంటి నొప్పి.

    • పాలన చేతకాక రేవంత్‌రెడ్డి నిరాశ, నిస్పృహలో ఉన్నారు.

  • Feb 05, 2026 20:39 IST

    సిరిసిల్ల: హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదు: కేటీఆర్‌

    • దేవుళ్ల పేర్లు చెప్పుకుని బీజేపీ ఓట్లు అడుగుతోంది: కేటీఆర్

    • కాంగ్రెస్‌కు ఓటు వేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు: కేటీఆర్‌

  • Feb 05, 2026 20:38 IST

    అంబటి రాంబాబు పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ

    • తనపై కేసు కొట్టివేయడంతో పాటు రిమాండ్‌ రిపోర్ట్‌ను సస్పెండ్‌ చేయాలని అంబటి రాంబాబు పిటిషన్‌

    • తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా.

  • Feb 05, 2026 19:43 IST

    మేఘాలయలో ఘోర ప్రమాదం, 16 మంది మృతి

    • తూర్పు జయంతియా హిల్స్‌ బొగ్గు గనిలో పేలుడు.

  • Feb 05, 2026 18:41 IST

    రాహుల్‌ గాంధీకి గర్వం తలకెక్కింది: ప్రధాని మోదీ

    • కాంగ్రెస్‌ నుంచి ఎంతోమంది పార్టీ వీడి వెళ్లిపోయారు.

    • ఇదే సభలో ఓ ఎంపీని రాహుల్‌ ద్రోహి అన్నారు.

    • బిట్టు సిక్కు కావడంతో అతన్ని అవమానించారు.

    • సిక్కుల పట్ల కాంగ్రెస్‌కున్న ద్వేషం వారి మాటల్లో కనిపించింది.

    • ప్రతి విషయంలో విపక్షాలు నన్ను నిందిస్తున్నాయి.

    • నక్సలిజాన్ని అంతం చేసినందుకు నన్ను దూషిస్తున్నారు.

    • ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినందుకు నన్ను నిందిస్తారా?

    • మా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగింది.

  • Feb 05, 2026 18:13 IST

    నీటి విలువ తెలిసేలా ఇంకుడుగుంతలు కార్యక్రమం చేపట్టాం: చంద్రబాబు

    • 10 లక్షల ఇంకుడుగుంతలు, మైక్రో ఇరిగేషన్‌తో నీటి సద్వినియోగం.

    • అనంతపురం జిల్లాను పండ్లతోటల వనంగా మార్చాం.

    • హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

    • ఏపీలో 40 నదుల నీరు వాడుకుంటే కరవు అనేదే ఉండదు.

  • Feb 05, 2026 18:12 IST

    వెలిగొండ పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకు సాగు, తాగు నీరు ఇస్తాం: చంద్రబాబు

    • 2014-19 మధ్య సాగునీటి రంగంలో రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టాం.

    • రాయలసీమ లిఫ్ట్‌తో చాలా ప్రయోజనాలున్నాయని మభ్యపెడుతున్నారు.

    • ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత సాగునీటి సంఘాలది.

    • కాల్వల మరమ్మతులు సహా పనులన్నీ సాగునీటి సంఘాలకే ఇస్తాం.

  • Feb 05, 2026 18:11 IST

    ఏపీలో నీటిని సమర్థవంతంగా వినియోగిస్తాం: సీఎం చంద్రబాబు

    • నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలిస్తాం.

    • ఏపీని నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం.

    • ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల వద్ద నీళ్లు తీసుకోవచ్చు.

    • చింతలపూడి లిఫ్ట్‌, వంశధార-నాగావళి సహా అన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం.

  • Feb 05, 2026 18:08 IST

    మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు: జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ

    • ప్రాథమికంగా నిర్థారించిన జాతీయ మహిళా కమిషన్‌ విచారణ కమిటీ.

    • పోలీసుల నుంచి లిఖిత పూర్వక నివేదిక వచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్‌కు అందజేయనున్న విచారణ కమిటీ.

  • Feb 05, 2026 18:03 IST

    కాంగ్రెస్‌ను భారతీయ యువత ఎప్పటికీ క్షమించదు: ప్రధాని మోదీ

    • ప్రణాళిక సంఘాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీసింది.

    • కాంగ్రెస్‌ ప్రధానులకు ముందు చూపు లేనందునే భారత్‌ అభివృద్ధి కుంటుపడింది.

  • Feb 05, 2026 17:54 IST

    పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో రైతులకు ఎంతో మేలు: ప్రధాని మోదీ

    • కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

    • ముద్ర యోజనతో రూ.30 లక్షల కోట్ల రుణాలు పంపిణీ.

    • రైతులకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది.

    • రైతుల సమస్యలను కాంగ్రెస్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు.

    • ప్రపంచ సంక్షోభాలకు భారత్‌ పరిష్కారం చూపింది.

    పూర్తికథనం

  • Feb 05, 2026 17:53 IST

    యూపీఏ హయాంలో దోచుకోవడానికే అంతా పనిచేశారు: ప్రధాని మోదీ

    • బ్యాంకింగ్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ సర్వనాశనం చేసింది.

    • కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది.

    • మా పాలనలో బ్యాంకింగ్‌ వ్యవస్థ లాభాల్లో ఉంది.

    • బ్యాంకింగ్‌ రంగంలో NPAలను తగ్గించాం.

  • Feb 05, 2026 17:35 IST

    విపక్ష సభ్యుల తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం

    • రాహుల్‌ గాంధీ తాను చక్రవర్తి అనుకుంటున్నారు.

    • దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్ష నేతలకు అవగాహన లేదు.

    • బెంగాల్‌లో చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారు.

    • బెంగాల్‌ ప్రజల హక్కులను మమత కాలరాశారు.

    • ఢిల్లీలో ఆప్‌ నేతలు లిక్కర్‌ స్కాం చేశారు.

    • అమెరికాతో మేము ట్రేడ్‌ డీల్‌ చేసుకుంటే.. బోఫోర్స్‌తో కాంగ్రెస్‌ ఒప్పందం చేసుకుంది.

  • Feb 05, 2026 17:29 IST

    ఓం బిర్లా వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ

    • మాపై స్పీకర్‌ నిరాధార ఆరోపణలు: ప్రియాంక గాంధీ

    • నిరసన తెలిపితే దాడి అంటున్నారు: ప్రియాంక గాంధీ

  • Feb 05, 2026 17:29 IST

    భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌పై ప్రపంచం హర్షం వ్యక్తంచేస్తోంది: మోదీ

    • అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ తర్వాత భారత్‌ బలం మరింత పెరిగింది: మోదీ

    • అమెరికాతో ఒప్పందం ద్వారా యువతకు ఎక్కువ లబ్ధి: మోదీ

    • మన యువతకు ప్రపంచ దేశాలు స్వాగతం పలుకుతున్నాయి: మోదీ

    పూర్తికథనం..

  • Feb 05, 2026 17:25 IST

    వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా సాగుతున్నాం: ప్రధాని మోదీ

    • రిఫార్మ్‌.. పెర్ఫార్మ్‌.. ట్రాన్స్‌ఫార్మ్‌ దిశగా భారత్‌: ప్రధాని మోదీ

    • ఉత్పత్తి రంగంలో అనేక విజయాలు సాధించాం: ప్రధాని మోదీ

    • ఎక్స్‌ప్రెస్‌ వేగంతో సంస్కరణలు అమలు: ప్రధాని మోదీ

    • అన్ని రంగాల్లో పోటీ పడేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది: మోదీ

    • మన MSMEలు ప్రపంచ దేశాల విశ్వాసం పొందుతున్నాయి: మోదీ

  • Feb 05, 2026 17:25 IST

    UPA హయాంలో 11వ ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ప్రధాని మోదీ

    • NDA హయాంలో త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ప్రధాని మోదీ

    • ప్రపంచంలో భారత్‌ పరపతి పెరుగుతోంది: ప్రధాని మోదీ

    • EU సహా 27 దేశాలతో భారత్‌ అనేక ఒప్పందాలు: ప్రధాని మోదీ

    • 9 దేశాలతో ట్రేడ్‌ డీల్‌ చేసుకున్నాం: ప్రధాని మోదీ

  • Feb 05, 2026 17:19 IST

    విపక్షాల వాకౌట్‌

    • కాసేపు ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు.

    • అనంతరం రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్‌.

  • Feb 05, 2026 17:18 IST

    దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది: ప్రధాని మోదీ

    • అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది: ప్రధాని మోదీ

    • సరైన మార్గంలో పురోగమనం దిశగా భారత్‌: ప్రధాని మోదీ

    • దేశంలో ప్రతిభావంతమైన యువతకు కొరత లేదు: మోదీ

    • రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంక కీలకం: ప్రధాని మోదీ

    • దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు: మోదీ

  • Feb 05, 2026 17:17 IST

    రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం

    • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న మోదీ

    • మోదీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ విపక్షాల నినాదాలు

    • విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని మోదీ ప్రసంగం

  • Feb 05, 2026 16:44 IST

    నెల్లూరు: అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధురాలిని సురక్షితంగా గుర్తించిన పోలీసులు.

    • వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో గడ్డి ఊడలు సేకరించటానికి వచ్చిన కొందరు కడప జిల్లా వేమలూరు గ్రామస్తులు.

    • అడవిలో దారి తప్పి కనిపించకుండా పోయిన మామిడి నాగమ్మ (65).

    • 112కు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

    • గత రాత్రి 9:30 గంటలకు వృద్ధురాలిని కనుగొన్న పోలీసులు, కుటుంబ సభ్యులకు అప్పగింత.

    • పోలీసుల వేగవంతమైన చర్యకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.

  • Feb 05, 2026 16:40 IST

    కాంగ్రెస్‌ను చూసి BRSకు కడపు మండుతోంది: తుమ్మల

    • రూ.9 వేలకోట్ల రైతు భరోసా ఇస్తున్నాం: మంత్రి తుమ్మల

    • రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల

  • Feb 05, 2026 16:28 IST

    కరీంనగర్‌: చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో సీఎం రేవంత్.

    • పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు.

    • రామడుగులో రూ.45.15 కోట్లతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన.

    • గంగాధర మండలం మధురానగర్‌లో రూ.5 కోట్లతోప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన.

  • Feb 05, 2026 16:20 IST

    అంబటి రాంబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

    • ఈనెల 11కి విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.

    పూర్తికథనం

  • Feb 05, 2026 15:59 IST

    ట్రేడ్ డీల్‌పై త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!

    • భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం.

    • మరో 4-5 రోజుల్లో సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

    • డీల్‌కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించనున్న భారత్-యూఎస్ ప్రతినిధులు.

    • పూర్తికథనం

  • Feb 05, 2026 15:55 IST

    ఢిల్లీ: సాయంత్రం 5 గంటలకు రాజ్యసభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ.

    • రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడనున్న ప్రధాని మోదీ.

    • అమెరికా ట్రేడ్ డీల్ పై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం.

    పూర్తికథనం

  • Feb 05, 2026 15:51 IST

    సిట్‌పై నమ్మకం లేకే సుప్రీంను ఆశ్రయించాం: వైవీ సుబ్బారెడ్డి

    • లడ్డూలో జంతుకొవ్వు లేదని సీబీఐ తేల్చింది.

    • జంతు కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారు.

    • భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు.

    • కూటమి ప్రభుత్వం వచ్చాకే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి.

    • కూటమి నేతలు మళ్లీ విషప్రచారం చేస్తున్నారు.

  • Feb 05, 2026 15:49 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 504 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.

    • 133 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.

  • Feb 05, 2026 15:45 IST

    లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు

    • ప్రధానిపై దాడిచేసేలా విపక్ష సభ్యులు వ్యవహరించారు: ఓం బిర్లా

    • అందుకే ప్రధాని మోదీని సభలోకి రావొద్దని చెప్పా: ఓం బిర్లా

    • పార్లమెంట్‌ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు: ఓం బిర్లా

    • విపక్ష సభ్యులు సభా మర్యాదను మంటగలిపారు: ఓం బిర్లా

  • Feb 05, 2026 15:44 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 504 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.

    • 133 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.

  • Feb 05, 2026 15:15 IST

    పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

    • టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్.

    • పాక్ నిర్ణయంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్.

    • ఇండియా, పాక్ మ్యాచ్ జరగకపోతే క్రికెట్ ప్రపంచం నష్టాల్లో కూరుకుపోతుంది: బీసీబీ డైరెక్టర్

    • పాక్ వైఖరి ఇతర బోర్డులకు నష్టం తెచ్చిపెట్టేలా ఉంది: బీసీబీ డైరెక్టర్

    పూర్తికథనం

  • Feb 05, 2026 15:11 IST

    అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

    • తన యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం వస్తుందన్నారు.

    • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.

    పూర్తికథనం

  • Feb 05, 2026 15:11 IST

    లోక్‌సభ రేపటికి వాయిదా

    • భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌పై విపక్షాల ఆందోళన.

    • ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్.

    • విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ వాయిదా.

  • Feb 05, 2026 15:06 IST

    మున్సిపాలిటీలకు కాంగ్రెస్ సర్కార్‌ నిధులు ఇవ్వలేదు: బండి సంజయ్‌

    • కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదు.

    • BRS నేతలు కబ్జాలు చేసి రూ.వేల కోట్లు సంపాదించారు.

  • Feb 05, 2026 15:02 IST

    నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదు: పవన్‌

    • తప్పు చేసి క్షమాపణ అడగకుండా తిరిగి మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు: పవన్

    • శ్రీవారి దగ్గర తప్పు చేసిన వారు నాశనమైపోతారు: పవన్‌

    • సిట్‌ రిపోర్ట్‌ ఎక్కడా వైసీపీకి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు: పవన్‌

    • రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

    పూర్తికథనం

  • Feb 05, 2026 15:02 IST

    ఏపీ నకిలీ మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు

    • ఈనెల 19 వరకు రిమాండ్‌ పొడిగించిన విజయవాడ కోర్టు.

  • Feb 05, 2026 14:43 IST

    హైదరాబాద్‌: ముషీరాబాద్‌ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

    • హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

    • సుధామ పీజీ అకామిడేషన్‌ ఫర్‌ ఉమెన్‌ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.

    • మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది.

    • షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల అనుమానం.

    పూర్తికథనం

  • Feb 05, 2026 14:42 IST

    కూటమి నేతలు ఎక్కడైనా బూతులు మాట్లాడారా?: సీఎం చంద్రబాబు

    • ఇప్పటికీ వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు.

    • వివేకాను హత్య చేసి.. కత్తి నా చేతిలో పెట్టారు.

    పూర్తికథనం

  • Feb 05, 2026 14:40 IST

    తిరుమల పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారు: సీఎం చంద్రబాబు

    • రసాయనాలు కలిపారని సీబీఐ చార్జ్‌షీట్‌లో ఉంది.

    • ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పరా?

    • ప్రతి ఒక్కరూ ఈ మహాపాపంపై చర్చించాలి.

    • పరకామణి కేసులో సెటిల్‌మెంట్‌ చేసి సమర్థిస్తారా?

    • దొంగతనం చేసిన వారిని సమర్థిస్తారా?

    • ఇది వేంకటేశ్వరస్వామిపై దాడే.

    • మహా పాపం చేశారు.. క్షమాపణలు చెప్పాలి.

    • తప్పు చేసినవారికి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో మీరే చూస్తారు.

    • దోషులకు కచ్చితంగా శిక్ష తప్పదు.

    • దేవుడి పవిత్రతను కాపాడలేనంత అసమర్థులం కాదు.

  • Feb 05, 2026 14:08 IST

    జగన్‌ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

    • దుర్మార్గాలు చేసి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

    • వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు భక్తులు తిరుమలకు రావాలంటే అనుమానించే పరిస్థితి వచ్చింది: సీఎం చంద్రబాబు

    • ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతాం: చంద్రబాబు

    • వైసీపీ.. నాతోనే కాదు, దేవుడితో కూడా పెట్టుకున్నారు : సీఎం చంద్రబాబు

    • శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

  • Feb 05, 2026 14:00 IST

    స్వామివారి నిధుల దుర్వినియోగంపై జవాబు చెప్పాలి: ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌

    • అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది.

    • స్వామివారి నిధులు దుర్వినియోగంపై నాటి ప్రభుత్వం జవాబు చెప్పాలి.

    • అన్యమతస్థుల సంఖ్య పెంచి ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూశారు.

    • భక్తులు మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాలి.

  • Feb 05, 2026 13:29 IST

    మున్సిపల్ ఎన్నికలకు కో-ఆర్డినేటర్ల నియామకం..

    • హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కో-ఆర్డినేటర్ల నియామకం..

    • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కో-ఆర్డినేటర్ల నియామకం..

    • ప్రచారం, నేతల మధ్య సమన్వయం చేయనున్న కో-ఆర్డినేటర్స్..

  • Feb 05, 2026 13:17 IST

    విజయవాడకు చేరుకున్న మంత్రి నారాయణ..

    • విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న మంత్రి నారాయణ బృందం..

    • రెండురోజుల పాటు లండన్‌, ఒకరోజు దోహాలో పర్యటించిన బృందం..

    • పర్యాటక ప్రాజెక్టులు, స్పోర్ట్స్‌ సిటీపై అధ్యయనానికి వెళ్లిన మంత్రి నారాయణ..

  • Feb 05, 2026 12:54 IST

    రీల్స్ కోసం బైక్‌‌ స్టంట్.. వ్యక్తి మృతి..

    • కడప నగర శివారులో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు..

    • వేగంగా వెళ్లే బైక్‌‌పై విన్యాసాలు చేస్తుండగా అదుపు తప్పిన బైక్..

    • ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు..

    పూర్తి కథనం..

  • Feb 05, 2026 12:30 IST

    కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు..

    • మేడ్చల్‌: కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు..

    • రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SE చిన్నారెడ్డి..

    • రూ.1.40 కోట్ల పెండింగ్‌ బిల్లుల మంజూరుకు రూ.30 లక్షల డిమాండ్..

    • చిన్నారెడ్డికి 14రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లి ఏసీబీ కోర్టు..

  • Feb 05, 2026 12:05 IST

    గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..

    • 5వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన కేంద్రం..

    • తొలి విడతగా రూ.259.36 కోట్ల విడుదల..

    • కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు.. ఎన్నికల జాప్యంతో నిలిచిపోయిన నిధులు..

    • గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదల.

    పూర్తి కథనం..

  • Feb 05, 2026 11:39 IST

    రాజ్యసభలో కొనసాగుతున్న మాటల యుద్ధం

    • సభలో నన్ను మాట్లాడనివ్వడం లేదు..

    • పార్లమెంట్‌లో విపక్ష సభ్యులను గొంతెత్తనివ్వడం లేదు: మల్లికార్జున్ ఖర్గే

  • Feb 05, 2026 11:36 IST

    నైజీరియాలో సాయుధ మూక నరమేధం..

    • కార్వా రాష్ట్రంలోని వోరో, నూక గ్రామాల్లో దాడులు..

    • 200 మంది ప్రజలను చంపిన ఉగ్రమూకలు..

    • ఇటీవల ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా.. సైనిక ఆపరేషన్లు చేపట్టిన ప్రభుత్వం..

  • Feb 05, 2026 11:11 IST

    వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది: సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన సీబీఐ

    • వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన సీబీఐ

    • ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామన్న సీబీఐ..

    • ఇంకా ఎవరినైనా విచారించాలనుకుంటే అనుమతి పొందవచ్చన్న ధర్మాసనం..

    • సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్రా హాజరై వాదిస్తారని.. అంతవరకూ పాస్ ఓవర్ చేయమని అడిగిన సునీత తరపు న్యాయవాది..

    • విచారణ మరికొద్దిసేపటికి వాయిదా..

  • Feb 05, 2026 11:06 IST

    లోక్ సభ వాయిదా

    • ఢిల్లీ: లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా..

    • విపక్షాల ఆందోళన నడుమ సభను వాయిదా వేసిన స్పీకర్..

  • Feb 05, 2026 10:44 IST

    గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట

    • గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు బెంచ్ తీర్పు..

    • సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన సీజే ధర్మాసనం..

    • గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు..

    • మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి..

    • సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీ పీఎస్సీ, ఎంపికైన అభ్యర్థుల అప్పీలుపై ధర్మాసనం తీర్పు..

    • తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సీజే బెంచ్..

    • ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం..

    పూర్తి కథనం..

  • Feb 05, 2026 10:12 IST

    ఔషధ విక్రయ డొమైన్లను సీజ్‌ చేసిన అమెరికా

    • భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న 200 ఔషధ విక్రయ డొమైన్ల సీజ్‌ చేసిన అమెరికా డీఈఏ..

    • అక్రమంగా ఆన్‌లైన్‌ ఫార్మా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన అమెరికా డీఈఏ..

    • 2022 నుంచి అమెరికాలోని రాకీ మౌంటేన్‌ ఫీల్డ్‌ డీఈఏ ఆర్గనైజేషన్‌ దర్యాప్తు..

  • Feb 05, 2026 10:05 IST

    ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు కీలక నేత మృతి

    • ఛత్తీస్‌గఢ్‌: పెద్దగెల్లూరు అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..

    • మావోయిస్టు కీలక నేత ధరమ్‌సింగ్‌ మృతి..

    • ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాల స్వాధీనం..

    • భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

  • Feb 05, 2026 10:03 IST

    పాలక్కాడ్‌లో పేలుడు పదార్ధాల స్వాధీనం..

    • కేరళ: పాలక్కాడ్‌లో 100 బాక్స్‌ల్లో పేలుడు పదార్ధాల గుర్తింపు..

    • 20 బాక్సుల్లో డిటోనేటర్లు, 80 బాక్సుల్లో జిలెటెన్‌ స్టిక్స్‌ స్వాధీనం..

    • పుచ్చకాయల లోడ్‌ కింద దాచి పేలుడు పదార్థాల అక్రమ రవాణా..

  • Feb 05, 2026 10:01 IST

    పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌ల చోరీ..

    • మహబూబాబాద్: బయ్యారం మండలంలో పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ పాస్‌వర్డ్‌ల చోరీ..

    • 290 జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

    • ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు..

    • MPDO ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

    పూర్తి కథనం..

  • Feb 05, 2026 09:47 IST

    మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు

    • హైదరాబాద్‌: BRS మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు..

    • సీపీ సజ్జనార్‌పై అనుచిత వ్యాఖ్యల చేశారంటూ..

    • బంజారాహిల్స్‌ పీఎస్‌లో జీవన్‌రెడ్డిపై కేసు నమోదు..

    • పోలీస్‌ అధికరుల సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు..

    పూర్తి కథనం..

  • Feb 05, 2026 09:35 IST

    అల్‌-ఫలా వర్సటీ ఛైర్మన్‌ సిద్ధిఖీ అరెస్ట్‌

    • హరియాణా: అల్‌-ఫలా వర్సటీ ఛైర్మన్‌ సిద్ధిఖీ అరెస్ట్‌..

    • UGC ఫిర్యాదుతో జావెద్‌ అహ్మద్‌ సిద్ధిఖీపై కేసు నమోదు..

    • అల్‌-ఫలా వర్సిటీ కేంద్రంగా ఢిల్లీ పేలుళ్లకు కుట్ర కేసులో అరెస్ట్..

  • Feb 05, 2026 09:33 IST

    భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్

    • టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోయేది లేదు..

    • క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

    పూర్తి కథనం..

  • Feb 05, 2026 09:05 IST

    గూగుల్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు సన్నాహాలు

    • బెంగళూరులో గూగుల్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు సన్నాహాలు..

    • అమెరికా వర్క్‌ వీసా నిబంధనలు కఠినతరం నేపథ్యంలో..

    • భారత్‌లో మరో పెద్ద కార్యాలయం ఏర్పాటు చేసే యోచన..

    • గూగుల్‌ క్యాంపస్‌తో మరో 20 వేల మందికి ఉద్యోగావకాశాలు..

  • Feb 05, 2026 08:52 IST

    విశాఖలో బాంబు కలకలం..

    • విశాఖ తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం..

    • స్క్రాప్ దుకాణం దగ్గర అనుమానాస్పదంగా 3 బ్యాగులు..

    • తనిఖీలు నిర్వహించి ఏమీ లేదని తేల్చిన పోలీసులు..

  • Feb 05, 2026 08:51 IST

    నేడు మేడారానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు..

    • ములుగు: మేడారంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..

    • సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటాగా తీసుకున్న కమిషన్..

    • డెలినా ఖోంగ్డస్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు..

    • నేడు మేడారం రానున్న కమిటీ సభ్యులు..

  • Feb 05, 2026 07:55 IST

    నేడు గ్రూప్‌-1పై హైకోర్టు తుది తీర్పు..

    • హైదరాబాద్‌: నేడు గ్రూప్‌-1పై హైకోర్టు తుది తీర్పు..

    • గతంలో మెరిట్‌ లిస్ట్‌ రద్దు చేసిన సింగిల్‌ బెంచ్‌..

    • TGPSC అప్పీల్‌ పిటిషన్‌పై నేడు డివిజన్‌ బెంచ్‌ తీర్పు..

  • Feb 05, 2026 07:30 IST

    జోగి రమేష్‌ బెయిల్‌ రద్దుపై నేడు విచారణ

    • జోగి రమేష్‌ బెయిల్‌ రద్దుపై నేడు హైకోర్టులో విచారణ..

    • మద్యం కేసులో జోగి రమేష్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న..

    • పోలీసుల పిటిషన్‌పై విచారించనున్న హైకోర్టు..

  • Feb 05, 2026 07:29 IST

    నేడు సాగునీటి సంఘాల అధ్యక్షుల భేటీ..

    • అమరావతి: నేడు సాగునీటి సంఘాల అధ్యక్షుల భేటీ..

    • జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం..

    • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్..

    • సాగునీటి సంఘాలకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.

  • Feb 05, 2026 06:54 IST

    నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

    • నేటి నుంచి మేడారం మహా జాతర హుండీల లెక్కింపు..

    • రికార్డు స్థాయిలో ఈ సారి 828 హుండీల ఏర్పాటు..

  • Feb 05, 2026 06:53 IST

    నేటి నుంచి అమిత్‌ షా పర్యటన..

    • జమ్మూకశ్మీర్‌లో నేటి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన..

    • 3 రోజులు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న అమిత్‌ షా..

    • జమ్మూకశ్మీర్‌లో భద్రతపై అమిత్‌ షా సమీక్ష..

  • Feb 05, 2026 06:23 IST

    సైబర్‌ నేరాల నియంత్రణకు నేడు షీల్డ్‌- 2026 కాంక్లేవ్‌

    • నేడు హైదరాబాద్‌లో సైబర్‌ నేరాల నియంత్రణకు షీల్డ్‌-2026 కాంక్లేవ్‌..

    • కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

    • సదస్సులో పాల్గొననున్న 14 రాష్ట్రాల సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు.

  • Feb 05, 2026 06:21 IST

    నేడు చొప్పదండిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం

    • నేడు చొప్పదండిలో సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

    • కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లిలో పొంగులేటి రోడ్‌షో..

    • నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి ప్రచారం..

  • Feb 05, 2026 06:19 IST

    నైజీరియాలో రెచ్చిపోయిన సాయుధ మూకలు

    • నైజీరియాలో మరోసారి రెచ్చిపోయిన సాయుధ మూకలు..

    • సాయుధ మూకల దాడుల్లో 162 మంది మృతి.

  • Feb 05, 2026 06:17 IST

    నేడు భీమవరంలో జగన్‌ పర్యటన..

    • నేడు ప.గో.జిల్లా భీమవరంలో జగన్‌ పర్యటన..

    • పెదఅమిరంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్‌.

  • Feb 05, 2026 06:16 IST

    రేపు ప్రధాని.. 'పరీక్షాపే' చర్చ..

    • రేపు ప్రధాని నరేంద్ర మోదీ.. 'పరీక్షాపే' చర్చ..

    • విద్యార్థుల్లో ఆత్మవిశ్వాపం నింపేలా ప్రధాని ప్రసంగం.

  • Feb 05, 2026 06:14 IST

    నేడు టీజీఈ సెట్‌ నోటిఫికేషన్ విడుదల

    • నేడు టీజీఈ సెట్‌-2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఫిబ్రవరి 9నుంచి మే 15వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ..

  • Feb 05, 2026 06:11 IST

    నేడు కూటమి పార్టీ అధినేతల సమావేశం

    • అమరావతి: నేడు కూటమి పార్టీ అధినేతల సమావేశం..

    • సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌ భేటీ..

    • తిరుమల లడ్డూలో రసాయనాల అంశంపై కీలక సమావేశం..

    • లడ్డూ వ్యవహారాన్ని ప్రజలకు వివరించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, ఏపీ బీజేపీ చీఫ్‌..

    • కూటమి పార్టీల అధినేతలు ప్రెస్‌ మీట్ పెట్టే అవకాశం..