బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:11 AM
సీపీ సజ్జనార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత రాష్ట్ర సమితి(బీఆస్ఎస్) పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ సీపీ సజ్జనార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
జీవన్‌రెడ్డి ఏమన్నారంటే..
గత ఆదివారం తెలంగాణ భవన్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సీపీ సజ్జనార్ ఖబద్దార్.! నన్నే ఏమీ చేయలేకపోయావ్.. ఇంకా కేసీఆర్‌ను ఏం చేస్తావ్? తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను విచారణల పేరుతో అవమానిస్తే చూస్తూ ఊరుకోము. డీజీపీ కావాలని సజ్జనార్ కలలు కంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా? పింక్‌బుక్‌లో సజ్జనార్ నంబర్ వన్‌లో ఉంటారు. సజ్జనార్ కర్ణాటక పోయినా, పుణె పోయినా.. ఎంపీ అయినా మేము వదిలిపెట్టం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి.. తీసుకోండ్ర
కొంపముంచిన రీల్స్ పిచ్చి.. మూతి కాలిపోయిందిగా..