గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:05 AM
తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలపై కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది.
హైదరాబాద్: గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
గతంలో.. గ్రూప్ 1 నియామకాలపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను పునః మూల్యాంకనం చేయాలని నాడు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో పిల్ వేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుది తీర్పునకు లోబడి గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని ఇప్పటికే గతంలో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News