నమ్మించి నట్టేటా ముంచుతారా?
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:39 AM
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. నమ్మించి నా గొంతు కోశారంటూ రెబల్ అభ్యర్థి చింతల బాలమణిరాములు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.
బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఆవేదన
రామాయంపేట(మెదక్): ‘బీఆర్‌ఎస్ నమ్మించి నా గొంతు కోసింది. టికెట్ నీకే బరిలో దిగు అని నమ్మించి నట్టేట ముంచారు’ అంటూ ఆ పార్టీ రెబల్ అభ్యర్థి చింతల బాలమణిరాములు(Chintala Blaamaniramulu) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడపడుచుకు అన్యాయం చేసిన ఉసురు ఊరికే పోదంటూ కన్నీరుమున్నీరయ్యారు. మెదక్(Medak) జిల్లా రామాయంపేట మున్సిపల్ ఐదో వార్డు నుంచి బీఆర్‌ఎస్ పక్షాన ఆమె నామినేషన్ వేశారు. బీఫామ్ దక్కనందున టికెట్ ఆశించి భంగపడ్డ బాలమణి బుధవారం మీడియా సమావేశంలో బావోద్వేగంతో మాట్లాడారు.
మొదట్లో పార్టీకి అభ్యర్థులే కరువవగా తాను ఐదో వార్డు నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి మాట ఇచ్చారన్నారు. ఆ నమ్మకంతో తాను తన భర్త కుమారులతో కలిసి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ప్రచారం చేసుకున్నాక, ఇప్పుడు మరొకరికి బీఫాం ఇచ్చి మోసం చేశారంటూ దుయ్యబట్టారు. అయినప్పటికీ తాను పోటీ నుంచి తప్పుకునేదే లేదని, ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని గెలుస్తానన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News