-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 30th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 30 , 2026 | 07:43 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 30, 2026 21:23 IST
విజయవాడ: ముగిసిన ఆర్టీసీ అధికారులు, JAC నేతల చర్చలు
రేపు భేటీ తర్వాత అభిప్రాయాలు వెల్లడిస్తామన్న JAC నేతలు
25 అంశాలపై చర్చ జరిగింది: APSRTC ఎండీ బాలసుబ్రహ్మణ్యం
90% అంశాలపై అవగాహన కుదిరింది: APSRTC ఎండీ
విద్యుత్ వాహనాలపై ప్రధాన చర్చ: APSRTC ఎండీ
-
Jul 30, 2026 21:20 IST
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇప్పటికే బిల్లును ఆమోదించిన లోక్‌సభ
రాజ్యసభ రేపటికి వాయిదా
-
Jul 30, 2026 21:15 IST
కాళేశ్వరం ఫట్.. ఎల్లంపల్లి హిట్: తెలంగాణ ప్రభుత్వం
రివర్స్ పంపింగ్ లేకుండానే నిండిన ఎల్లంపల్లి: ప్రభుత్వం
కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోకుండానే పూర్తిస్థాయికి చేరువ
ఎల్లంపల్లికి కడెం, స్థానిక పరీవాహకమే బలం: ప్రభుత్వం
-
Jul 30, 2026 21:13 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ!
కేబినెట్ విస్తరణ అవకాశాలు ఉన్నాయంటున్న బీజేపీ వర్గాలు
-
Jul 30, 2026 21:05 IST
హైదరాబాద్: గవర్నర్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ
లష్కర్ బోనాలకు గవర్నర్‌కు ఆహ్వానం
గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి
-
Jul 30, 2026 20:58 IST
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం
విజయలక్ష్మి తరఫున న్యాయవాదిగా పరిగణించాలంటూ వాసుదేవుడు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
న్యాయవాదిగా కోగంటి రిత్వికను కొనసాగిస్తానని కోర్టుకు తెలిపిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
తదుపరి విచారణ 10 రోజులకు వాయిదా వేసిన హైకోర్టు
-
Jul 30, 2026 20:57 IST
సిద్దిపేటలో CPS ఉద్యోగుల నిరసన
పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డిమాండ్
CPS ఉద్యోగుల డిమాండ్‌ను నెరవేర్చాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Jul 30, 2026 20:57 IST
విశాఖ: హిందూస్థాన్ షిప్‌యార్డ్ మరో ఘనత
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో మరో చారిత్రక మైలురాయి
నౌకాదళానికి అత్యాధునిక 'INS నిపుణ్' నౌకను అందజేసిన HSL
సముద్రగర్భ వ్యూహాత్మక సామర్థ్యానికి మరింత బలం
-
Jul 30, 2026 20:56 IST
కామారెడ్డి: తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో విషాదం
ఇంటి ముందు తవ్విన పిల్లర్స్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి నవ్య శ్రీ మృతి
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన తాడ్వాయి పోలీసులు
-
Jul 30, 2026 20:28 IST
మహిళా ఎస్‌ఐపై దురుసు ప్రవర్తన పట్ల చర్యలు తీసుకుంటాం: రాయపాటి శైలజ
SI పట్ల వైసీపీ నేతల తీరును తీవ్రంగా పరిగణిస్తున్నాం: ABNతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
-
Jul 30, 2026 20:27 IST
మహిళా SI పట్ల వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు: ABNతో హోంమంత్రి అనిత
మహిళా SIపై దురుసుగా ప్రవర్తించినవారిపై చట్టపర చర్యలు: హోంమంత్రి అనిత
అప్పలరాజు కుమారుడు తప్పు చేసినందుకే కేసు పెట్టారు: ABNతో హోంమంత్రి అనిత
-
Jul 30, 2026 20:26 IST
భారత నౌకాదళ శక్తి మరింత బలోపేతం: 'ఎక్స్'లో పవన్ కల్యాణ్
స్వదేశీ యుద్ధనౌక INS మచిలీపట్నం జలావతరణం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మచిలీపట్నం పేరుతో యుద్ధనౌకకు గుర్తింపు: పవన్ కల్యాణ్
ఏపీ సముద్ర వారసత్వానికి గౌరవ సూచకంగా పేరు: పవన్
తీర భద్రత, సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం: పవన్
ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో కీలక అడుగు: 'ఎక్స్'లో : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jul 30, 2026 20:15 IST
గుంటూరు: మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటికి నూజివీడు పోలీసులు
ముస్తఫాతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై కిడ్నాప్ కేసు నమోదు
కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారును సీజ్ చేసేందుకు వచ్చిన పోలీసులు
కారు సీజ్ చేయాలని ముస్తఫా కుమార్తె ఫాతిమాకు చెప్పిన పోలీసులు
ముస్తఫా ఇంటికి చేరుకున్న అంబటి రాంబాబు, వైసీపీ నేతలు, కార్యకర్తలు
-
Jul 30, 2026 20:14 IST
భారీ వర్షాలపై తెలంగాణ CS సంజయ్ జాజు సమీక్ష
కలెక్టర్లు, పోలీస్ అధికారులకు CS కీలక ఆదేశాలు
జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి: CS
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి
పూర్తి స్థాయిలో NDRF, SDRF బృందాలు సిద్ధం: CS
-
Jul 30, 2026 20:13 IST
మంచిర్యాల : ఎల్లంపల్లి 15 గేట్లు ఎత్తి వేత
లక్షా71 వేల 650 క్యూ సెక్కుల నీరు విడుదల
ఇన్ ఫ్లో 3లక్షల 56 వేల 254 క్యూసెక్కులు
ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది
పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
-
Jul 30, 2026 20:08 IST
అల్లూరి: జీకే వీధి మండలంలో భారీ వర్షాలు
బత్తునూరు దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
-
Jul 30, 2026 19:57 IST
క్షమాపణ చెప్పిన తర్వాతే జగన్ ఉత్తరాంధ్రలో పర్యటించాలి: ఎంపీ కలిశెట్టి
జగన్ వ్యాఖ్యలు చట్టాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి: ఎంపీ కలిశెట్టి
రాజ్యాంగం పట్ల జగన్‌కు అవగాహన, గౌరవం లేవు: ఎంపీ కలిశెట్టి
సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసిన అంశాన్ని తప్పుకాదనే విధంగా జగన్ మాట్లాడుతున్నారు
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపారు: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
-
Jul 30, 2026 19:54 IST
ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న తెలంగాణ సర్కార్
మరో రూ.2 వేల కోట్ల బకాయిలను విడుదల చేసిన ఆర్థికశాఖ
100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిల చెల్లింపులు పూర్తి
3 విడతల్లో రూ.2 వేల కోట్లు చొప్పున రూ.6 వేల కోట్ల విడుదల
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేసిన ఉద్యోగులు, పెన్షనర్లు
-
Jul 30, 2026 18:44 IST
నెల్లూరు జిల్లా: దుత్తలూరు మండలం నందిపాడు వద్ద ప్రమాదం
టైరు పగిలి మినీ వ్యాన్ బోల్తా.. ఒకరి మృతి, 9 మందికి తీవ్రగాయాలు
బద్వేల్ నుంచి పామూరు వెళ్తుండగా ఘటన
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 30, 2026 18:34 IST
నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద
ఇన్ ఫ్లో 72,000 క్యూసెక్కులు
-
Jul 30, 2026 18:31 IST
కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
EC స్వయం ప్రతిపత్తి దెబ్బతినదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
CEC, EC నియామకాల కమిటీలో CJI తొలగింపును సమర్థించుకున్న కేంద్రం
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహరిస్తారని ముందే భావించడం తప్పు: కేంద్ర ప్రభుత్వం
ECల నియామక కొత్త చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం
-
Jul 30, 2026 18:29 IST
మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష
అంగన్వాడీల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలి: మంత్రి సీతక్క
అక్టోబర్ తొలి వారంలోగా అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనిఫామ్‌లు సిద్ధం చేయాలి: మంత్రి సీతక్క
-
Jul 30, 2026 18:28 IST
NTR భరోసా పెన్షన్లకు రూ.2,712.73 కోట్లు విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
62,07,573 మంది లబ్ధిదారులకు ఆగస్టు నెల పెన్షన్లు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఉత్తరాంధ్రలో నేడు రూ.514.42 కోట్ల పెన్షన్ల పంపిణీ: కొండపల్లి
ఆగస్టు 1న మిగిలిన జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ: మంత్రి కొండపల్లి
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ముందుగానే పెన్షన్ల పంపిణీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-
Jul 30, 2026 18:26 IST
రాజ్యసభలో వైసీపీ, టీడీపీ ఎంపీల వాగ్వాదం
పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుపై వైవీ సుబ్బారెడ్డి ప్రసంగం
ఏపీ డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి
సుబ్బారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎంపీ సానా సతీష్
గొడ్డలి పార్టీ నేతలు సభను తప్పుదారి పట్టిస్తున్నారన్న సానా సతీష్
వైసీపీ వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ సానా సతీష్ తీవ్ర అభ్యంతరం
-
Jul 30, 2026 18:02 IST
అల్లూరి జిల్లా : జీకే వీధి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు
గాలికొండ పంచాయతీ బత్తునూరు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు
ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్
-
Jul 30, 2026 17:50 IST
ఉస్మానియా ఆస్పత్రిలో బీరు సీసాల కలకలం
ఆస్పత్రి మొదటి అంతస్తులో బీరు సీసాలు లభ్యం
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
భద్రతా లోపాలపై అనుమానాలు.. రోగులు, వారి బంధువులు భద్రతపై ఆందోళన
ఆరా తీస్తున్న ఆస్పత్రి వర్గాలు
-
Jul 30, 2026 17:34 IST
శ్రీకాకుళం: సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్‌కు అనుమతి నిరాకరణ
సమయం దాటిన తర్వాత ములాఖత్‌కు వచ్చిన జగన్
సాయంత్రం 5 గంటల్లోపే కలిసేందుకు అనుమతి
జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల్లోపే ములాఖత్‌కు అనుమతి
5 గంటల తర్వాత కలిసేందుకు అనుమతి కోరిన వైసీపీ
ఉన్నతాధికారులను సంప్రదించిన జైలర్
నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేసిన జైలు అధికారులు
-
Jul 30, 2026 17:21 IST
భారత సరిహద్దుకు సమీపంలో అత్యాధునిక చైనా ఫైటర్ జెట్స్
సరిహద్దుకు సమీపంలోని స్థావరాల్లో జే-20 ఫైటర్ జెట్స్ మోహరింపు
రెండు స్థావరాల్లో దాదాపు 12 జెట్స్‌ను సిద్ధంగా ఉంచిన చైనా
కమర్షియల్ శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి
-
Jul 30, 2026 17:20 IST
శ్రీకాకుళం: సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్‌పై సందిగ్ధం
సాయంత్రం 5 గంటల్లోపు కలిసేందుకు అనుమతి ఇచ్చిన జైలు అధికారులు
సమయం దాటిపోయినా జైలు దగ్గరకు రాని జగన్
విశాఖ నుంచి బలప్రదర్శనగా వెళ్తున్న జగన్
విశాఖ నుంచి శ్రీకాకుళానికి గంటలకొద్దీ యాత్రను సాగదీసిన జగన్
-
Jul 30, 2026 17:19 IST
రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
ఎగువన భారీ వర్షాలతో కాటన్ బ్యారేజ్‌కు చేరుతున్న వరదనీరు
బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 67 వేల క్యూసెక్కుల విడుదల
ప్రస్తుతం 10.9 అడుగులకు చేరిన కాటన్ బ్యారేజ్ నీటిమట్టం
-
Jul 30, 2026 17:18 IST
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భద్రతా సమీక్ష సమావేశం
హోం సెక్రటరీ, ఐబీ చీఫ్‌తో అమిత్ షా సమీక్ష
దాదాపు గంటపాటు కొనసాగిన ఉన్నతస్థాయి భద్రతా సమావేశం
దేశ భద్రతా పరిస్థితులపై సమగ్రంగా చర్చించిన కేంద్ర హోంమంత్రి
-
Jul 30, 2026 17:12 IST
మహబూబాబాద్ : తొర్రూర్ మండలం మాటేడు దగ్గర ప్రమాదం
యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. అదుపుతప్పి బోల్తా
యాపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు
నిమిషాల్లోనే మొత్తం యాపిల్ పండ్లను ఎత్తుకెళ్లిన వైనం
-
Jul 30, 2026 16:55 IST
ఢిల్లీ: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో ఎంపీ ఈటల భేటీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని కోరిన ఈటల
డిఫెన్స్ భూముల్లో రోడ్ విస్తరణకు అనుమతి కోరిన ఈటల
-
Jul 30, 2026 16:55 IST
ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
చైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్, వైస్ చైర్మన్‌గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి
కమిటీ కన్వీనర్‌గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నియామకం
-
Jul 30, 2026 16:54 IST
కర్నూలు: ఏపీకి పరిశ్రమల రాకలో మంత్రి భరత్ కృషి ఎంతో ఉంది: లోకేశ్
కర్నూలు జిల్లాకు రిలయన్స్, ఫార్మా సహా ఇతర పరిశ్రమలు: మంత్రి నారా లోకేశ్
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
20 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకుంటాం: మంత్రి నారా లోకేశ్
మరో 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్: మంత్రి నారా లోకేశ్
-
Jul 30, 2026 16:31 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
నిందితుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ
దర్యాప్తు సంస్థల ఎదుట వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఇతర నిందితులకు ఇచ్చిన ఉత్తర్వులను వర్తింపజేయలేమని తేల్చిచెప్పిన సీజేఐ ధర్మాసనం
-
Jul 30, 2026 16:21 IST
హైదరాబాద్: ఎగుమతుల వృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక: CS సంజయ్ జాజు
తెలంగాణ ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం
CS సంజయ్ జాజు అధ్యక్షతన సమావేశం
ఎగుమతులకు అనుకూల విధానాల అమలుపై దృష్టి: CS
అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి: CS
-
Jul 30, 2026 16:20 IST
కర్నూలు: మంత్రి నారా లోకేశ్.. ఇండస్ట్రియల్ హీరో: మంత్రి టీజీ భరత్
నారా లోకేశ్ చొరవతో ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు: మంత్రి టీజీ భరత్
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకి రానున్న పవర్ ట్రాన్స్ మిషన్ ప్లాంట్స్
పత్తికొండ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఆగస్టు 31 నాటికి పూర్తి: మంత్రి టీజీ భరత్
ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి: మంత్రి టీజీ భరత్
-
Jul 30, 2026 16:17 IST
ఆగస్టు తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఒకరోజు సమావేశం నిర్వహణకు టీజీ సర్కార్ కసరత్తు
చట్టసభల్లో పోటీచేసేవారి వయసు కుదింపుపై తీర్మానం చేయనున్న అసెంబ్లీ
ప్రస్తుతమున్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కుదించాలని సీఎం రేవంత్ ప్రతిపాదన
ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ తొలివారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Jul 30, 2026 16:16 IST
నిర్మల్: కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి, 16 గేట్ల ఎత్తివేత
కడెం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో: 1,21,704, అవుట్ ఫ్లో: 1,69,340
-
Jul 30, 2026 16:15 IST
అమరావతి: APDASCAC బాధ్యతలు వేణుగోపాల్‌రెడ్డికి అప్పగింత
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి అదనపు బాధ్యతలు
MD కార్యాలయ బాధ్యతలు కూడా వేణుగోపాల్‌రెడ్డికే అప్పగింత
-
Jul 30, 2026 16:15 IST
హైదరాబాద్: గచ్చిబౌలి దగ్గర నిర్మాణ పనుల్లో ప్రమాదం
అపార్ట్‌మెంట్ కోసం తవ్విన పిల్లర్ గుంతలో విరిగిపడిన మట్టి పెళ్లలు
ఒక్కసారిగా మట్టిపెళ్లలు పడడంతో ముగ్గురికి గాయాలు
-
Jul 30, 2026 16:11 IST
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం
మరో రెండు రోజులపాటు వర్ష సూచన
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
Jul 30, 2026 15:50 IST
లోక్‌సభ రేపటికి వాయిదా
వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం
-
Jul 30, 2026 15:46 IST
శ్రీకాకుళం జైలు దగ్గర ఉద్రిక్తత
పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించిన వైసీపీ శ్రేణులు
పోలీసులను నెట్టుకుంటూ వెళ్లిన ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్
పోలీసులను నెట్టివేయడంతో స్వల్ప లాఠీచార్జ్
-
Jul 30, 2026 15:45 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
274 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
67 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 30, 2026 15:25 IST
CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
బీజేపీలో చేరాలంటూ కొందరు బెదిరిస్తున్నారు: అభిజీత్ దీప్కే
నా కుటుంబాన్ని చంపేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు: అభిజీత్
-
Jul 30, 2026 15:24 IST
రాజ్యసభ: ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సభ్యుల అభ్యంతరం
ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్
ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన చైర్మన్
-
Jul 30, 2026 15:16 IST
తూ. గో జిల్లా: నల్లజర్ల మండలం అనంతపల్లిలో రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
ఏలూరు నుంచి నిడదవోలు వెళ్తున్న కారు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న నల్లజర్ల పోలీసులు
-
Jul 30, 2026 15:04 IST
లోక్‌సభ మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా
విపక్షాల ఆందోళనతో మరోసారి వాయిదా
-
Jul 30, 2026 15:00 IST
రాజ్యసభ: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు: ఖర్గే
విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
పోలీసుల తీరుపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు?: ఖర్గే
ఇంతటి దారుణ ఘటనకు అమిత్ షాదే బాధ్యత: ఖర్గే
అమిత్ షా ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు: ఖర్గే
ఢిల్లీ ఘటనపై అమిత్ షా నోరువిప్పి మాట్లాడాలి: మల్లికార్జున ఖర్గే
-
Jul 30, 2026 14:43 IST
చైనా కంపెనీపై ఇరాన్ దాడి
ఉత్తర కువైట్‌లోని కంపెనీ భవనంపై నేడు ఉదయం దాడి
ఇరాన్ దాడిలో భారీగా దెబ్బతిన్న భవనం
కంపెనీకి చెందిన ఉద్యోగి మృతి
-
Jul 30, 2026 14:32 IST
జగిత్యాలకు రెడ్ అలర్ట్
ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్
అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం
ఉమ్మడి నిజామాబాద్‌తో పాటూ కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు
-
Jul 30, 2026 14:30 IST
రాజ్యసభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
బిల్లుపై 7 గంటల పాటు చర్చ
-
Jul 30, 2026 14:22 IST
హైదరాబాద్: ఈ మూడేళ్లు తెలంగాణను సక్రమంగానే నడిపించా: సీఎం రేవంత్
ఎక్కడా ఆగం కాలేదు.. కలగాపులగం చేయలేదు: సీఎం రేవంత్ రెడ్డి
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్
ప్రతి విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్
2014-23 మధ్య డ్రాపౌట్స్ పెరిగాయి: సీఎం రేవంత్
2023-26 వరకు డ్రాపౌట్స్ తగ్గి అడ్మిషన్లు పెరిగాయి: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 30, 2026 14:16 IST
లోక్‌సభ మధ్యాహ్నం 3గంటలకు వాయిదా
రాజ్యసభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
బిల్లుపై 7 గంటల పాటు చర్చ
-
Jul 30, 2026 13:42 IST
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు
పవన్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి నిమ్మల రామానాయుడు
-
Jul 30, 2026 13:41 IST
విశాఖ: జగన్‌పై ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం
తప్పు చేసిన సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించడమేంటి?: పల్లా
చనిపోయిన బాధిత కుటుంబాన్ని ముందు జగన్ పరామర్శించాలి: పల్లా
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తున్న సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ పరామర్శలు: పల్లా శ్రీనివాసరావు
-
Jul 30, 2026 13:39 IST
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ఇన్‌స్టాలో మహిళా ఐపీఎస్‌తో పరిచయం ఏర్పడింది: పోలీసులు
ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో దగ్గరయ్యారు: పోలీసులు
ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు: పోలీసులు
-
Jul 30, 2026 13:27 IST
హైదరాబాద్: రేపు ఉ.10గంటలకు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్
-
Jul 30, 2026 13:09 IST
విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు
మాజీ సీఐ నాగరాజును కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ఉ.10 నుంచి సా.5గంటల వరకు విచారణకు కోర్టు ఆదేశం
నాగరాజుకు భద్రత కల్పించాలని పోలీసులకు కోర్టు సూచన
కాసేపట్లో సిట్ కార్యాలయానికి నాగరాజు తరలింపు
వారం రోజుల పాటు నాగరాజును ప్రశ్నించనున్న సిట్
-
Jul 30, 2026 13:02 IST
హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై హెచ్ ఫాస్ట్ ఉక్కుపాదం
అత్తాపూర్‌లో అపరిశుభ్రంగా సమోసాలు, పానీపూరీ తయారీ నిర్వాహకుల గుట్టు రట్టు
అనుమతులు లేకుండా నడుస్తున్న నాలుగు ఫుడ్ తయారీ కేంద్రాల సీజ్
-
Jul 30, 2026 12:45 IST
ఢిల్లీ: ఎన్నిక కాని వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు?: సుప్రీంకోర్టు
బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం
ఆరు నెలలు దాటినా మంత్రిగా దీపక్ ప్రకాశ్ కొనసాగింపు
పంచాయతీ రాజ్ మంత్రిగా కొనసాగడంపై కోర్టులో విచారణ
-
Jul 30, 2026 12:30 IST
కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు
పెరుగుతున్న ఇన్‌ఫ్లోతో మరో గేటును ఎత్తిన అధికారులు
మొత్తం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలిన అధికారులు
-
Jul 30, 2026 12:28 IST
ఢిల్లీ: సుప్రీం కోర్టు పర్యవేక్షణలో హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేయాలి: రాహుల్
సీజేపీ ఆందోళనల్లో బలప్రయోగంపై రాహుల్ గాంధీ డిమాండ్
ఎక్స్‌లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ
-
Jul 30, 2026 12:23 IST
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కామెంట్స్..
మంచి గీతాలు వినాలి, తద్వారా స్ఫూర్తిని పొందాలి: వెంకయ్య
వందేమాతరం గేయం మనందరికీ సమాధానం: వెంకయ్య
దేశభక్తి, సమాజ ఐక్యత లోపిస్తే దేశం వెనకబడుతుంది: వెంకయ్య
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్య
యువత తమ భవిష్యత్తు తామే నిర్దేశించుకునే స్థాయికి ఎదగాలి: వెంకయ్య
-
Jul 30, 2026 12:17 IST
కుట్రపూరిత వీసా కేసులో అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ
నకిలీ వీసా కేసులో నిందితుడైన మితున్ పటేల్‌ను బహిష్కరించాలని ఓ అమెరికన్ కోర్టు ఆదేశం
బహిష్కరణతో పాటు ఒక రోజు జైలు శిక్ష, వెయ్యి డాలర్ల జరిమానా విధింపు
-
Jul 30, 2026 12:11 IST
హైదరాబాద్: నూర్ స్కూల్స్ యజమాని ఇంట్లో ఐటీ దాడులు
మహమ్మద్ ఖాజా కుతుబుద్దీన్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు
ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు గుర్తించిన ఐటీ అధికారులు
-
Jul 30, 2026 12:10 IST
భారత హాకీ జట్టుకు కొత్త జెర్సీ
ఆరెంజ్ రంగులో కొత్త జెర్సీ
అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్ వీరెన్ రస్కిన్హా
అభిమానులు జట్టును నీలంలోనే చూడాలని అనుకుంటున్నారు: వీరెన్
-
Jul 30, 2026 12:10 IST
చిలకలూరిపేట: మద్యం మత్తులో యువకుడి బీభత్సం
మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవ్ చేసిన యువకుడు
కారుతో బైక్‌లు, రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీకొట్టిన వైనం
భయంతో పరుగులు తీసిన స్థానికులు
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jul 30, 2026 11:49 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనలపై సుప్రీంకోర్టు విచారణ
నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్లు వాడటంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు
జులై 20న మోహరించిన RAF అమ్యునిషన్ లాగ్స్ భద్రపరచాలి: కేంద్రానికి సుప్రీం ఆదేశం
గాయపడిన విద్యార్థులకు వెంటనే వైద్య సాయం అందించాలి: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఉత్తర్వులు
కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
-
Jul 30, 2026 11:42 IST
విజయవాడ: సీఐ నాగరాజును కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు
ఇవాళ ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి కస్టడీకి తీసుకున్న సిట్
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఏ1గా సీఐ నాగరాజు
-
Jul 30, 2026 11:37 IST
పల్నాడు: అమరావతి మం. యండ్రాయిలో విషాదం
ఆవు కోసం చెరువులో దిగి ఇద్దరు విద్యార్థుల మృతి
మృతులు శివ (17), కిరణ్ (17)
-
Jul 30, 2026 11:36 IST
శ్రీసత్యసాయి జిల్లా: కియా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ
రూ.12 కోట్లతో పెనుగొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఒప్పందం
మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద ప్రతాలు మార్చుకున్న కియా సీఈవో కిమ్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
-
Jul 30, 2026 11:34 IST
హైదరాబాద్: నగర వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం
నగరంలోని పలు ప్రాంతాల్లో పడుతున్న వర్షం
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న జనాలు
-
Jul 30, 2026 11:27 IST
అమరావతి: జలవనరులశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరైన మంత్రి నిమ్మల, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు
-
Jul 30, 2026 11:27 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర భారీగా భద్రత
సీజేపీ ఆందోళన హెచ్చరికలతో ముందస్తు చర్యలు
కేంద్రం హామీలను ఉల్లంఘించిందన్న సీజేపీ
-
Jul 30, 2026 11:26 IST
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మ.2గంటలకు వాయిదా
-
Jul 30, 2026 11:19 IST
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు
28.5 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి
3,58,104 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవాహం
-
Jul 30, 2026 11:15 IST
నిజామాబాద్: మోర్తాడ్ మండలం ధర్మోర వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు
పాలెం - ధర్మోర గ్రామాల మధ్య నిలిచి పోయిన రాకపోకలు
-
Jul 30, 2026 11:13 IST
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన
విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ ప్లకార్డులు
-
Jul 30, 2026 11:03 IST
ఢిల్లీ చేరిన పంజాబ్ పేపర్ లీక్ నిరసనలు
ఆప్ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు
విద్యాశాఖ మంత్రి జ్యోత్‌సింగ్ రాజీనామాకు డిమాండ్
ఆప్ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు
-
Jul 30, 2026 10:39 IST
ఢిల్లీ: విధులను నిర్భయంగా నిర్వర్తించండి: సీఆర్‌పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్
విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటానని డీజీ హామీ
దళాల చర్యలకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటానన్న డీజీ
చట్టపరమైన విధుల్లో వెనుకడుగు వేయొద్దని సూచన
-
Jul 30, 2026 10:35 IST
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
పంచాయతీరాజ్ నిధులపై విచారణ జరపాలి: బండి సంజయ్
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అనుమానాలున్నాయి: బండి సంజయ్
నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి: బండి సంజయ్
పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత లేదు: బండి సంజయ్
-
Jul 30, 2026 10:34 IST
కడప: నగరంలోని విజయదుర్గా దేవి అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ
ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న కిలో బంగారం, మూడు లక్షల నగదు అపహరణ
రక్తసంబంధీకులే చేసినట్లు పోలీసుల అనుమానం
బాధితులను విచారిస్తున్న పోలీసులు
-
Jul 30, 2026 10:31 IST
కొత్త టాలెంట్ చూపించిన జగపతిబాబు
బిస్కెట్స్ తయారు చేసిన నటుడు జగపతిబాబు
ఇంట్లో బిస్కెట్స్ చేస్తూ వీడియో షేర్ చేసిన జగపతి బాబు
-
Jul 30, 2026 10:20 IST
క్యూబాలో కీలక సంస్కరణలు
ప్రైవేటు రంగానికి ఔషధ దుకాణాలు, ఇంధన స్టేషన్లు
ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేందుకు ప్రభుత్వ నిర్ణయం
ప్రజా సేవల మెరుగుదలకు కొత్త చర్యలు
-
Jul 30, 2026 10:19 IST
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అజింక్య రహానే
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడి
85 టెస్ట్ మ్యాచ్‌లు, 90 వన్డేలు ఆడిన రహానే
రహానే కెప్టెన్సీలోనే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సాధించిన భారత్
-
Jul 30, 2026 09:56 IST
అమరావతి: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక విచారణ
మాజీ సీఐ నాగరాజును కస్టడీకి తీసుకున్న సిట్
రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలింపు
వారం పాటు నాగరాజును ప్రశ్నించనున్న సిట్ అధికారులు
-
Jul 30, 2026 09:51 IST
జోగులాంబ గద్వాల: అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం
పాము కాటుతో 8వ తరగతి విద్యార్థి మృతి
ఇంట్లో నిద్రిస్తుండగా కే. తిరుమలేష్(14)ను కాటేసిన పాము
ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
చికిత్స పొందుతూ మృతి చెందిన తిరుమలేశ్
-
Jul 30, 2026 09:49 IST
ఆసిఫాబాద్‌లో పొంగి పొర్లుతున్న తుంపల్లి-మొరం వాగు
20కి పైగా గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
Jul 30, 2026 09:48 IST
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
27.4 అడుగులకు చేరి ప్రవహిస్తున్న గోదావరి
-
Jul 30, 2026 09:44 IST
వికారాబాద్ జిల్లాలో నిలిచిన వికారాబాద్ - పరిగి రాకపోకలు
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మద్గుల్ చిట్టెంపల్లి వద్ద రోడ్డుపైకి చేరిన వరద నీరు
బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో స్తంభించిన రవాణా
తాత్కాలిక బ్రిడ్జి పైనుంచి మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టిన అధికారులు
అప్రమత్తమైన పోలీసులు.. వాహనాలను తాత్కాలికంగా మన్నెగూడ మీదుగా దారి మళ్లింపు
ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు అధికారుల విజ్ఞప్తి
-
Jul 30, 2026 09:44 IST
వర్షాల దృష్ట్యా నిర్మల్, కొమురంభీం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Jul 30, 2026 09:15 IST
ఉక్రెయిన్ కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణుల దాడి
దాడికి ముందే హెచ్చరించిన జెలెన్‌స్కీ
అప్రమత్తమైన ఉక్రెయిన్ భద్రతా దళాలు
-
Jul 30, 2026 09:15 IST
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
వన్ టైమ్ ఫిజికల్ రిపోర్టింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం
సీటు అప్‌గ్రేడ్ కోసం ఇకపై ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆన్‌లైన్‌లోనే ప్రొవిజనల్ అడ్మిషన్ పొందే వెసులుబాటు
మెరుగైన సీటు లభిస్తే మునుపటి సీటు మరొకరికి కేటాయింపు
సీటు ఫ్రీజ్ చేసుకునే అభ్యర్థులు మాత్రమే కాలేజీకి వెళ్లాల్సి ఉంటుందన్న కేంద్రం
-
Jul 30, 2026 09:12 IST
నంద్యాల: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పెద్దపులి అనుమానాస్పద మృతి
నాగులూటి రేంజ్ ఇసుక గుండం సమీపంలో పులి కళేబరం లభ్యం
పులి కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ సిబ్బంది
మూడు రోజుల కిందటే పెద్దపులి మృతి చెంది ఉండవచ్చని అధికారుల అనుమానం
పోస్టుమార్టం నిమిత్తం పులి కళేబరాన్ని ల్యాబ్‌కు తరలించిన అధికారులు
-
Jul 30, 2026 08:28 IST
కొమురంభీం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
-
Jul 30, 2026 07:56 IST
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద
ఇన్‌ఫ్లో 91 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 81వేల క్యూసెక్కులు
జలవిద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
-
Jul 30, 2026 07:54 IST
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 79,403 క్యూసెక్కులు
పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 44.6 టీఎంసీలు
-
Jul 30, 2026 07:53 IST
మంచిర్యాల: భారీ వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద
ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణి ఖని, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
-
Jul 30, 2026 07:53 IST
కొమురంభీం: వట్టి వాగు ప్రాజెక్ట్ 3 గేట్ల ఎత్తివేత
ఇన్‌ఫ్లో 8వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 10,500 క్యూసెక్కులు
-
Jul 30, 2026 07:53 IST
భద్రాచలం దగ్గర 25 అడుగులకు చేరిన గోదావరి
ఎగువ కురుస్తున్న వర్షాలతో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
-
Jul 30, 2026 07:52 IST
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 46 వేల క్యూసెక్కులు
ప్రస్తుత నీటి నిల్వ 12.8 TMCలు, పూర్తి నీటి నిల్వ 20.1 TMCలు
-
Jul 30, 2026 07:52 IST
భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్ల ఎత్తివేత
ఇన్‌ఫ్లో 99,915 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 92,309 క్యూసెక్కులు
-
Jul 30, 2026 07:52 IST
అనంతపురం: గుత్తి మండలం టి.కొత్తపల్లి సమీపంలో కారు దగ్ధం
డ్రైవర్ సజీవ దహనం
హత్యా? ప్రమాదమా? అని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 30, 2026 07:50 IST
తిరుపతి: నకిలీ పత్రాలతో రూ.కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్
తిరుచానూరు పీఎస్ పరిధిలో నకిలీ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్
పోలీసులకు ల్యాండ్ ఓనర్ అరుణమ్మ ఫిర్యాదు
ఏడుగురిపై చీటింగ్ కేసు నమోదు
ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
-
Jul 30, 2026 07:49 IST
మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 46 వేల క్యూసెక్కులు
ప్రస్తుత నీటి నిల్వ 12.8864 TMCలు, పూర్తి నీటి నిల్వ 20.1 TMCలు
-
Jul 30, 2026 07:49 IST
ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన
నేడు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు
-
Jul 30, 2026 07:49 IST
అమరావతి: ఉద్యోగుల సమస్యలపై ఆర్టీసీ దృష్టి
నేడు ఉద్యోగ సంఘాల జేఏసీతో కీలక సమావేశం
జేఏసీ ప్రతినిధులతో చర్చించనున్న ఆర్టీసీ వీసీ, ఎండీ
ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
-
Jul 30, 2026 07:48 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
నేడు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్
-
Jul 30, 2026 07:48 IST
కర్నూలు: నేడు పత్తికొండ మం. హోసూర్‌లో మంత్రి లోకేశ్ పర్యటన
సోలార్ పవర్ ప్లాంట్‌కు భూమి పూజ చేయనున్న లోకేశ్
-
Jul 30, 2026 07:47 IST
ఫ్రాన్స్ రక్షణ రంగానికి ముప్పుగా మారుతున్న కార్చిచ్చు
అణుకేంద్రాలతో పాటు యుద్ధ విమానాల తయారీ యూనిట్ల వైపు వేగంగా దూసుకొస్తున్న మంటలు
12 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపిస్తోన్న ఉపగ్రహ చిత్రాలు
-
Jul 30, 2026 07:45 IST
జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసుల ఆంక్షలు: ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి
సీదిరితో ములాఖత్ వరకు అనుమతి ఇచ్చాం: ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి
ర్యాలీలు, జనసమూహాలకు అనుమతి లేదు: ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి
ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి
జగన్ కాన్వాయ్‌లో 8 వాహనాలకు అనుమతి: ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి
-
Jul 30, 2026 07:44 IST
నేడు శ్రీకాకుళం జిల్లాకు మాజీ సీఎం జగన్
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
ప్రధాని మోదీ భోగాపురం పర్యటనతో జగన్ పర్యటనపై నిఘా
-
Jul 30, 2026 07:44 IST
అమరావతి: రేపటితో ముగియనున్న పంటల బీమా గడువు
రైతులందరూ పంటల బీమా చేయించుకోండి: అచ్చెన్నాయుడు
-
Jul 30, 2026 07:43 IST
నేడు విజయవాడలో మున్సిపల్ కార్మికుల మహాధర్నా
సమస్యలు పరిష్కరించాలని కార్మికుల డిమాండ్
-
Jul 30, 2026 07:43 IST
రామాయణ సినిమా ట్రైలర్ విడుదల
ప్రపంచ వ్యాప్తంగా రామాయణ సినిమా ట్రైలర్ విడుదల