Share News

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:39 PM

ప్రశ్న పత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది.

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Exam Paper Leak Law

ఇంటర్నెట్ డెస్క్: ప్రశ్న పత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బిల్లు ద్వారా పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు, పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.


కొత్త నిబంధనల ప్రకారం.. ప్రశ్న పత్రాల లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు పేపర్ లీక్ కేసుల్లో 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా ఉండేది. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు అమల్లో ఉన్నాయి. తాజా సవరణలతో పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం కానుంది. ప్రతిపక్షాల నిరసనలు, వాకౌట్ మధ్య రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం పరీక్షల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని కేంద్రం వెల్లడించింది.


ఈ వార్తలనూ చదవండి:

‘గోమూత్ర నిపుణుడు’ అంటూ వ్యాఖ్య.. ప్రియాంక గాంధీకి విద్యావేత్తల ఘాటు లేఖ

సీఈసీ నియామక చట్టంపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Updated Date - Jul 30 , 2026 | 09:53 PM